ఉత్కంఠభరితంగా “మడ్డీ” టీజర్
ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ తెరకెక్కుతున్న చిత్రం "మడ్డీ". భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ... మొత్తం 5 భాషల్లో రూపొందుతోంది. యువన్, రిధాన్ కృష్ణ రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పికే7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా "మడ్డీ" టీజర్ ను 5 భాషల్లో విడుదల చేశారు. తెలుగు టీజర్ ను బ్లాక్...
“శ్రీకారం” టైటిల్ సాంగ్ వచ్చేసింది
కిశోర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం "శ్రీకారం". శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల అయింది. "కనివిని ఎరుగని కథ ఇక మొదలైంది. అడుగులో అడుగుగా.. వెతికిన వెలుగుల అలికిడి...
యష్ మొట్ట మొదటి డబ్బింగ్ చిత్రం “గజకేసరి” టీజర్
కన్నడ స్టార్ హీరో "కేజీఎఫ్" చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన "కేజీఎఫ్" చిత్రం 2018, డిసెంబర్ 21న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కెజియఫ్ 240 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా యష్, ప్రశాంత్ నీల్ వైపు సినిమా ప్రపంచం కళ్ళు పడ్డాయి. రాఖీ భాయ్‌కు అంతా సలాం కొట్టారు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేజీఎఫ్ సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రాన్ని చేసిన యష్ ఈ మూవీని...
“ఉప్పెన” మేకింగ్ వీడియో
మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన చిత్రం "ఉప్పెన". ఫిబ్రవరి 12న విడుదలైన ఉప్పెన మూవీ ఇప్పటికీ మంచి వసూళ్ళతో దూసుకుపోతుంది. 'ఉప్పెన'కు ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టే దిశగా పరుగులు పెడుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. బేబమ్మగా కృతి శెట్టి, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్, కృతి...
ఆకట్టుకుంటున్న “షాదీ ముబారక్” ట్రైలర్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ "షాదీ ముబారక్". ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. "షాదీ ముబారక్"’ మార్చి 5న విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ పెంచేసింది. . కాగా హీరోయిన్ తను పెళ్లి చేసుకునే అబ్బాయే కాదు, తన ఇంటిపేరు కూడా అందంగా ఉండాలని అనుకుంటుంది. అలాంటి అమ్మాయికి సున్నిపెంట అనే ఇంటి పేరు ఉండే హీరోతో పెళ్ళి అంటే...
విరాటపర్వం : ‘కోలు కోలు నా సామి’ లిరికల్ సాంగ్
రానా, సాయి పల్లవి జంటగా డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో 'రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్' అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్‌తో మూవీ రూపొందిస్తున్నారు. వెన్నెల అనే పాత్రలో సాయి పల్లవి రోల్ ఈ సినిమాకు కీలకం కానుందట. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా 'విరాటపర్వం'...
“మోసగాళ్లు” ట్రైలర్ విడుదల చేసిన మెగాస్టార్
24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్లు". జెఫ్రే గీ చిన్ "మోసగాళ్లు" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌చంద్ర, రుహీసింగ్, నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. "మోసగాళ్లు" చిత్రంలో ఏసీపీ కుమార్ అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 25న విడుదల చేశారు. "యుఎస్‌లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ మీద జరిగిన ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ.....
“గంగూబాయి కతియావాడి” టీజర్… అలియా నటనకు సెలెబ్రిటీలు సైతం ఫిదా
అలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్న సినిమా "గంగూబాయి కతియావాడి". ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో గంగుబాయి అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హుస్సేన్ జైదీ రచించిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై'లోని 'మేడమ్ ఆఫ్ కామటిపుర' ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో నివసించే ఓ వేశ్య అందర్నీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా...
“టక్ జగదీష్” టీజర్ వచ్చేసింది…!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "టక్ జగదీష్". ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని 26వ చిత్రమైన "టక్ జగదీష్"కు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా 'టక్ జగదీష్' టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ పూర్తిగా మాటలతో కాకుండా థీమ్ పాటతో సాగింది. నాని, రీతు లవ్ ట్రాక్...
చావు కబురు చల్లగా : “కదిలే కాలాన్నడిగా…” లిరికల్ వీడియో సాంగ్
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యంగ్ హీరో కార్తికేయ "చావు కబురు చల్లగా" అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. యువ దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ ఓ అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే మాస్ మసాలా ఐటమ్ సాంగ్ లో చిందేసింది. "చావు కబురు చల్లగా"...