రాళ్ళ వానకి పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి – ఎంపీపీ చిలుక రవీందర్

353
chiluka ravinder

ఈరోజు చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో నిన్న కురిసిన రాళ్ల వాన కారణంగా మొక్కజొన్న ,మిర్చి, మామిడిపండ్లతోటలు, వరి పంటలు నష్ట పోయిన పంటలను చొప్పదండి మండల ఎంపీపీ చిలుక రవీందర్ పరిశీలించారు.

రైతులను ఓదారుస్తూ వెంటనే తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మరియు అధికారులకు సమాచారం అందించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ, గ్రామ సర్పంచ్ చిలుక లింగయ్య,ఫ్యాక్స్ చైర్మన్ వెలమమల్లారెడ్డి ,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ ముద్దసానినారాయణ ,బిఆర్ఎస్ నాయకులు మాచర్ల వినయ్ ,రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు వెల్మశెట్టి రాజయ్య మరియు రైతులు మొదలగు వారు పాల్గొన్నారు.