శివాజీ జయంతి వేడుకలను జరిపిన పలు కుల సంఘాలు

161
Gopi rajaka

◆ పరాయి స్త్రీ తల్లిలాంటిదని చాటి చెప్పిన మహావీరుడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నాయకులు

◆ పరాయి పాలనలో స్వావలంబన ఉండదని సమాజానికి చాటి చెప్పిన నవయుగ వైతాళికుడు

★ నిర్విరామంగా కార్యక్రమాలను దిగ్విజయంగా హైదరాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న TRRS హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్ గారిని సన్మానించిన రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సిములు

తరగని స్పూర్తి నానాటికీ పెరుగుతున్న ఖ్యాతి హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా నేనున్నానంటూ అభయం కల్పించిన వీరుడు వేసిన ప్రతి అడుగు హైందవ సమాజ ఔన్నత్యానికే అనేది సత్యం. వెన్ను చూపని ఆయన పోరాటంలో కుటుంబాన్ని కోల్పోయాడు. వారి త్యాగాలు హిందూ సమాజానికి సదా ఆదర్శం.

“అదిగో ఛత్రపతి… ధ్వజమెత్తిన ప్రజాపతి… భరతమాత నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు” ఆయన గురువైన సమర్థ రామదాసు పరీక్షలో నెగ్గి గురు భక్తిని చాటుకున్న వీరుడు తల్లిపై అమితమైన ప్రేమ కలిగిన యుద్ద వీరుడు. అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు 19-2-2023 ఆదివారం హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో గాడ్గే బాబా దళిత సేవా సమితి వ్యవస్థాపకులు డాక్టర్ స్వామి అల్వాల్ అధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

Kondrathi Ramesh

శివాజీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ కట్టెల సుభాష్, న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు మాదరబోయిన నర్సయ్య ,బహుజన రాజ్యం పార్టీ ఉపాధ్యక్షులు జె.ప్రకాష్ వీర్, శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంద్రపు సుదర్శన్, యూత్ అధ్యక్షులు గౌటె గణేష్, యంఆర్పియస్ రాష్ట్ర కార్యదర్శి బడుగుల బాలకృష్ణ, కె.రమేష్ కుమార్, బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎలుకల మహేందర్ గౌడ్, ఎఐఎస్సీఆర్పి ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభుదాస్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ అధ్యక్షులు లకడంపల్లి నర్సిములు, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బేగంపేట నర్సింహా ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్రాతి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి తిప్పరాజు కృష్ణ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ, మేడ్చల్ జిల్లా యూత్ అధ్యక్షులు అర్రొల్ల కన్నయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి చౌలపల్లి ఆనంద్ ,అంబర్ పేట్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సోమరాజు రాజు ,దమ్మయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు జెల్ల నర్సింహా ,కమలాకర్, సాయి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.