చదువుకుంటేనే బలహీన వర్గాల ఉన్నతి – చిలుక రవీందర్

285
MPP, Choppadandi

ఈరోజు చొప్పదండి మండలం లోని చిట్యాల పల్లి గ్రామ పంచాయతీ లో Dr BR అంబేద్కర్ సంఘ భవనం ఆవరణలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఎంపీపీ చిలుక రవీందర్ గారు హాజరై వారు ఈ కార్యక్రమన్ని ఉద్దెశించి మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతులు హక్కులపై అవగహన కల్పించుటకు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది అని అన్నారు.

దీని ముఖ్య ఉద్దెశం అందరూ సమానత్వంతో అన్నివర్గాలతో కలిసి మెలిసి ఉండాలని అంటరానితనం అశ్రుశ్రత నివారించేవిధంగా ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. దీనికి షెడ్యూలు కులాలు మరియు షెడ్యూలు తరుగతులవారు చదువుకోవడం ముఖ్యమని ఉన్నతంగా ఎదిగి అందరికి సహాయ పడి సమాజానికి ఎంతో ఉపయోగ పడాలని కోరినారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడిపాక సురేష్,ఎంపీటీసీ సభ్యులు చాకుంట గోపు మంగ-నరేందర్ రెడ్డి,చొప్పదండి డిప్యూటీ తహసీల్దార్,RI అరుణ్ కుమార్, వార్డ్ సభ్యులు ఉస్కామల్ల మధు, అంబేద్కర్ సంఘ గ్రామ శాఖ అధ్యక్షులు సముద్రాల నాగయ్య, పల్లె ధవాఖాన డాక్టర్, అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.