
సామాజిక న్యాయం జరగాలంటే బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం బలంగా ఏర్పడి సంఘటితమైతేనే రాజ్యాధికారం దక్కుతుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు.
శనివారం మేట పల్లి లోని వాసవి గార్డెన్ లో సాంబారి ప్రభాకర్ ఆధ్వర్యం లో జన అధికార సమితి నిర్వహించిన సబ్బండ వర్గాల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన వెబినార్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.సబ్బండ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా కొంత బలపడినప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా వెనకబడి ఉన్నామన్నారు. దీనికి కారణం రాజకీయం అంటే కేవలం డబ్బు పరపతి ఉండాలనే భావన సమాజం లో నాటుకుపోయిందన్నారు.
రాజకీయం అంటే మన హక్కులకు భంగం కలగకుండా మనకు మనమే సమస్యలను పరిష్కరించుకొని అవసరాలను తీర్చుకోగలుగుతామని తెలుసుకోవాలన్నారు. దేని కోసం ఎవరిని అడుక్కోకూడదంటే మన సామాజిక వర్గాలు అధికారం సాధిస్తేనే మన నిర్ణయాలు మనం తీసుకునే స్థాయిలో ఉంటామన్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభంలో నరహరి ఐఏఎస్ నేతృత్వంలో నిర్వహించబడుతున్న ఆలయ ఫౌండేషన్ చేపట్టిన విద్య ఉపాధి సేవలను గురించి తెలియజేశారు.
అనంతరం జన అధికార సమితి సెక్రటరీ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంఘటితం అధికారం సమానత్వం అనే లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని జన అధికార సమితి ని నరహరి ఐఏఎస్ మార్గదర్శకత్వం లో బీసీలలో ఉత్తేజిత కార్యక్రమాలను రూపొందించుకొని ప్రణాళికాబద్దంగా అన్ని సామాజిక వర్గాలలో నెలకొన్న సమస్యలను అవగాహన చేసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా కొంత కృషి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిక్కి ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలపై అవగాహన కల్పించడం జరిగింది. గడ్డం రమేష్ బృందం జానపద గీతాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను సభ వేదికగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మీనా సుఖేందర్ గౌడ్, జక్కని సుజాత కుందన్, బీమానాతి భవాని, సత్యనారాయణ, యమా రాజయ్య, మరిది పోచయ్య, హోగా గంగాధర్, రుద్రా శ్రీనివాస్, జిల్లా ధనుంజయ్, జన అధికార సమితి అధ్యక్షులు చేరాల నారాయణ, ఉపాధ్యక్షులు పరికిపండ్ల రామ్, కార్యదర్శి కృష్ణమూర్తి, పరికిపండ్ల సుమంత్, బిక్కి కృష్ణమూర్తి, ఆడెపు నరేందర్, దాసరి కిరణ్, పరికిపండ్ల వినయ్, రాజేష్, ఆలయ ఫౌండేషన్ కన్నం వెంకటేష్, తువ్వా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.