అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోండి

421
Ravula Rajendar

ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మరియు జూలపల్లి మండలాల్లో ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ మరియు జిల్లా ఇంచార్జి రావుల రాంనాథ్ పరిశీలించడం జరిగినది.

నాయకులు మాట్లాడుతూ ఇటివల కురిసిన అకాల వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా మొత్తంలో వరి, మొక్కజొన్న, మిర్చి అలాగే ఇతర కూరగాయల పంటలు అధికంగా దెబ్బతిని రైతులు నష్టపోవడం జరిగినది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే నష్టపోయిన ప్రతి రైతుకు కూడా లబ్ధి జరిగేది అని అన్నారు .

వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నష్టపోయిన ప్రతి వరి, మొక్కజొన్న, మిర్చి ఇతర పంటలకు సంబంధించిన రైతులందరికీ ఎకరాకి 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నామని అన్నారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనాత్మక కార్యక్రమలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, తంగెడ రాజేశ్వరరావు, కొమ్మ ఐలయ్య , అమర గాని ప్రదీప్ కుమార్, కొప్పుల మహేష్, ఎర్రోళ్ల శ్రీకాంత్, మల్లెత్తుల ఆంజనేయులు, కందుల సదానందం పలువురు పాల్గొన్నారు.

కలెక్టర్ కి వినతిపత్రం

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారిని బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ జిల్లా ఇన్చార్జి రావుల రాంనథ్ గారు ఎక్స్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ గారు కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది .

BJP district president

నాయకులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వర్షాల కారణంగా పెద్దపెల్లి జిల్లాలో వరి , మొక్క
జొన్న తదితర పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది దీనితో చేతికి వచ్చిన పంట చేతికి అందక రైతులు తెచ్చుకున్న అప్పులు తీర్చలేక అయోమయానికి గురువుతున్నారు. వెంటనే పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది . వెంటనే మండలాల వారిగా పంట నష్టం సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు పరిహరం అందే విధంగా కృషి చేయాలని కోరారు.

డిమాండ్స్:
1) రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు చెల్లించాలి.
2)ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇస్తానన్న పదివేల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి.
3) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పంటల బీమా పథకం) తెలంగాణ రాష్టంలో అమలు చేసి రైతులను ఆదుకోవాలి.
4)తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతుల్లేకుండా మరియు తాలూ టప్ప పేరుతో ఎలాంటి కట్టింగ్ లేకుండా తీసుకోవాలి.
5) రైస్ మిల్లర్లు బిఆర్ఎస్ అండదండలతో రైతుల నుండి అడ్డగోలుగా కటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అందోళనాత్మక కార్యమ్రులు చేస్తామని హెచ్చరించారు .

వినతి పత్రం సమర్పించిన వారిలో పార్లమెంట్‌ కన్వీనర్ మల్లికార్జున్, చందుపట్ల సునీల్‌ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు దాడి సంతోష్, పిడుగు కృష్ణ, నాంపల్లి రమేష్, తంగేడు రాజేశ్వరావు, పోల్సని సంపత్ రావు, బెజ్జంకి దిలీప్ కుమార్, ఎర్రోళ్ళ శ్రీకాంత్, ఉప్పు కిరణ్, కందుల సదానందం, ఉషవేణి అన్వేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.