రజకులను ఎస్సీలో చేర్చాలి : తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి

428
gopi rajaka

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్ మండల కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన 14-3-2023 మంగళవారం ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఒకేదేశం ఒకే కులం ఒకే రిజర్వేషన్ గా ఉండవలసిన సేవా కులమైన రజకులను బిన్న రిజర్వేషన్ లను కొనసాగించడం బాధాకరమని అన్నారు.

ఎస్సీలుగా కొనసాగుతున్న 17 రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎంతో పురోగతి సాధిస్తున్నారు మిగతా 12 రాష్ట్రాలలో అందుకు బిన్నంగా ఉండటం చాలా విచారకరమన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జారిచేసిన ఆర్డినెన్స్ ను అధ్యాయనం చేసి అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

జిల్లా అధ్యక్షులు మాచ్చర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 45 సం.లు నిండిన రజక వృత్తిదారులకు పెంఛన్ ఇవ్వాలని, రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. నూతన నియామకంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా ముదుగుల సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులుగా సిహెచ్. గోపాల్ మరియు బొర్రొల్ల కృష్ణ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా అధ్యక్షులు మాచ్చర్ల శ్రీకాంత్ వారికి నియామక పత్రాలు అందజేశారు.

ఈసందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఎస్సీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేస్తామని అన్నారు.గోలింగాల ఉపసర్పంచ్ ముదుగుల సత్యనారాయణ గారిని శాలువాతో సన్మానించిన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక.
ఈ సమావేశానికి నాగిరెడ్డి పేట్ మండల అధ్యక్షులు సిహెచ్. నాగయ్య,సిహెచ్. గంగారాం, జి.అంజయ్య, సిహెచ్. రాజు ,సిహెచ్. పోచయ్య, సిహెచ్. యాదయ్య ,సిహెచ్. దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.