పెద్దపల్లి జిల్లా, ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రత్నాకర్ రావు ప్రమాదవశాత్తు తన రెండు కాళ్ళు కోల్పోవడంతో నడవలేని స్థితిలో ఉన్న తను వీల్ చైర్ కోసం ఆలయ ఫౌండేషన్ ను సంప్రదించగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపండ్ల నరహరి IAS గారి సూచన మేరకు MRO కత్రోజు రమేష్ గారి సహకారంతో ఫౌండేషన్ సభ్యులు Dy CEO మిట్టపల్లి రాజేందర్, కీర్తి నాగార్జున వీల్ చైర్ అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ విద్య వైద్య ఉపాధి కల్పన లక్ష్యంగా నిరుపేదలకు సహాయం అదించడం కోసం ఆలయ ఫౌండేషన్ పని చేస్తుంది అని, అందులో భాగంగానే ఏప్రిల్ 10 తేదీన బసంత్ నగర్ లో శంకర్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి హాస్పిటల్ ప్రారంభిస్తున్నట్లు, ఈ హాస్పిటల్ లో ఉచిత కంటి పరీక్షలు చేసి, అవసరం ఉన్న వారికి పూర్తి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తామని తెలిపారు.