బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి

384
Peddapalli BJP

కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటివరకు మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ అన్నారు.

బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం చేపట్టిన మహా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ గారు నియమించిన 6 గురు సభ్యులతో కూడిన కమిటీ మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ అభియాన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో సమావేశం అయ్యారు.

మే 30 తేదీ నుండి జూన్ 30 తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజవంతం చేసే విధంగా కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహా జన సంపర్క్ అభియాన్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరియు పెద్దపల్లి అసెంబ్లీ ఇంఛార్జీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మంథని నియోజకవర్గం ఇంఛార్జీ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్, రామగుండం ఇంఛార్జీ భీమారపు సంపత్, ధర్మారం మండలం ఇంఛార్జీ అమరగాని ప్రదీప్, జిల్లా మీడియా ఇంఛార్జీ తంగేడి రాజేశ్వర్ రావు, జిల్లా సోషల్ మీడియా ఇంఛార్జీ ముంజ రాజేందర్ ప్రసాద్ మరియు పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, పార్లమెంట్ విస్తారక్ సురేష్, మంథని అసెంబ్లీ కో కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు..