పిల్లల ఎత్తు బరువు తల్లి దండ్రులు పర్యవేక్షించాలి-జిల్లా అదనపు కలెక్టర్

215
additional collector

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్ వాడి ల్లో ప్రతి మంగళవారం పెరుగుదల పర్యవేక్షణ వారం గా ప్రకటించారని 0-6 సంవత్సరాల వయసున్న పిల్లల పెరుగుదల పై దృష్టి ఉంచాలని
అంగన్ వాడి, ఆరోగ్య కార్యకర్తల సూచనలు తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అంగన్ వాడి ల్లో అందించే ఆహారం శాస్త్రీయ ప్రమాణాల తో తయారు చేయబడినది కాబట్టి పిల్లలు గర్భిణులు ఈ ఆరోగ్యమైన పోషకాహారాన్ని తీసుకోవాలని పసిపిల్లలకు ప్రతి మంగళ వారం బరువు తూచి నియమిత బరువు ఎత్తు వున్నారో సరి చూసుకోవడం లో అంగన్ వాడి కార్యకర్త తో పాటు తల్లులు, కుటుంబ సభ్యులు కూడా శ్రద్ధ తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి గరిమ అగర్వాల్ సూచించారు.

గర్భిణీ స్త్రీలు రక్త హీనతకు లోను కాకుండా క్రమం తప్పకుండా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెల నెలా చెక్ అప్ చేసుకోవాలని కోరారు.

ఎంపీపీ చిలుక రవీందర్ మాట్లాడుతూ గర్భిణులు సంప్రదాయకంగా లభించే పల్లు ఫలాల తో పాటు, బలవర్డక ఆహారం స్వీకరించాలని ఇప్పుడు అన్ని గ్రామాల్లో అంగన్ వాడి ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఉన్నారని ఇబ్బంది ఎదురైతే వారిని సంప్రదించాలని కోరారు.

అంగన్ వాడీల్లో లభించే బాలామృతం , చిరుధాన్యాల కిచిడి బరువు తక్కువ వున్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో అందచేయాలని పిల్లలు సాధారణ బరువు వచ్చేవరకు తల్లులు, అంగన్ వాడి, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

ఆసుపత్రికి సంబంధించిన అవసరాలు ఎదురైతే ఆసుపత్రి చైర్మన్ గా ఉన్న తనను సంప్రదించ వచ్చని అయన తెలియ చేశారు.

choppadandi MPP

స్థానిక ఎంపీటీసీ మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలో 16 అంగన్ వాడి కేంద్రాలకు పక్కా భవనాలు లేవని నిర్మింప చేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో ఇంకుడు గుంతలు, టాయిలెట్లు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించక పోవడం పై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రాగంపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. వేతనం ఎంత వస్తుంది, త్రాగు నీరు అందు బాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో పారిశ్యుద్ధం పెంచాలని, రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించే కార్యక్రమం చేపట్టాలని వారానికి రెండుసార్లు నీటిని మొక్కలకు అందించాలని ఆదేశించారు.

చెత్త సెగ్రిగేషన్ షేడ్ లలో చెత్త వేరు చేస్తున్నారా అని ఆరా తీశారు. పల్లె ప్రగతి స్ఫూర్తి నీ ప్రతి గ్రామంలో కొనసాగించాలని, నిర్లక్షం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ను ఆదేశించారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మామిడి లత రాజేశం, జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి సుజాత, జిల్లా విద్యాధికారి, తహశీల్దార్ అంబటి రజిత,ఎంపిడిఓ ఇనుకొండ స్వరూప రాణి, జిల్లా ఉప వైద్యాధికారి వినీత,
జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సి డి పి ఒ కస్తూరి, సూపర్వైజర్ రమాదేవి, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు పాషా , వైద్య అధికారులు, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్ వార్డ్ సభ్యురాలు గసిగంటి సోనియా
అంగన్ వాడి కార్యకర్తలు సరోజన, ఎల్లమ్మ, శశిరేఖ, గ్రామ పెద్దలు, తల్లుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.