ఈటెల కు ధన్యవాదాలు తెలిపిన బీసీ ఫెడరేషన్ కులాల సమితి

305
yugandhar

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీలో ఫెడరేషన్ ల గురించి ప్రస్తావించిన సందర్భంగా తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లాపు దుర్గారావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ ఆధ్వర్యంలో ఆయనను ఈరోజు తేదీ 20.02.2023 సోమవారం ఉదయం 7.00 గంటలకు వారి నివాసం షామీర్పేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలుపడం జరిగినది.

కార్యక్రమంలో రాజేందర్ అన్నగారిని శాలువా , పూలమాలలతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు సంఘ వీరప్ప, బోయ శంకర్, ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఏపూరి శివరాం, మల్కాజిగిరి నియోజకవర్గ కన్వీనర్ తాళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.