ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

226
TRRS

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో 26-4-2023 బుధవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు గోపి హాజరయ్యారు.

జిల్లా అధ్యక్షులు మాచ్చర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక రైతాంగ ఉద్యమాలు చేసినటువంటి చిట్యాల ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్న తర్వాత ఆమె విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించకపోవడం చాలా బాధాకరమని వారన్నారు. ఏర్పాటు చేయకపోవడంలో అంతర్యం ఏమిటో తెలంగాణ సమాజానికి వివరించాలన్నారు.

ఇకనైనా చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కోరారు.అదేవిధంగా ఆమె జన్మించినటువంటి జనగామ జిల్లాకు చిట్యాల ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో రాజు,ముత్యం, రవి నరసయ్య, సంతోష్ భాస్కర్ గంగాధర్ శంకర్, బాలయ్య, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు