ఓడిబియ్యం అర్థం తెలియకుండా డిబేట్ ఎలా పెట్టావ్ రా ఎదవ ?

4709
venkatakrishna

ఒడిబియ్యం అంటే తెల్ల బియ్యం కాదు. పచ్చటి పందిరి కింద పసుపు బియ్యం.. తెలివి ఎక్కువైతే అవి తెల్ల బియ్యం లాగ కనిపిస్తాయి. అయినోళ్ల మంచి కోరుతూ ఇచ్చేవి. కన్న బిడ్డల, తోబుట్టువుల మద్య, నిరంతరంలా ఇది ఓ అద్భుతమైన సంప్రదాయం. మనిషిని, మనిషి ప్రేమించుకునేందుకు పుట్టిన సంప్రదాయం. ఉన్నోడు, లేనోడు పాటించే సంప్రదాయం. ఒడిబియ్యం పోసేటప్పుడు పెట్టే కుంకుమ, పసుపు బియ్యం, కొత్తబట్టలు ఎల్లకాలం ఆమె అనుభవించాలని దీవించి, ఆడబిడ్డ, అల్లుడి కాళ్లు మొక్కి వారు కలకాలం చల్లగా ఉండాలని దీవిస్తారు. తెలంగాణ సంప్రదాయల్లో ఒకటైన ఒడిబియ్యంపై జర్నలిస్టు వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజానికం మండిపడుతోంది.

జర్నలిజం విలువ తీసిన దరిద్రుడు

AP 24X7 చానెల్‌లో  ఏదో ఓ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నయ్. ఆ కార్యక్రమంలో వెంకట కృష్ణ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బియ్యం దొరికేవి కాదు.. ఇప్పటికీ తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంది. ఆడపిల్లకి పండక్కి ఒడిబియ్యం పడతారు. అదేంటో తెలుసా? ఎప్పుడు బియ్యం తినని కుటుంబాలు కాబట్టి. ఆ రోజు కూతుర్ని, అల్లుడ్ని ఇంటికి పిలిచి, తెల్లబియ్యం పెడితే.. అది పండగ చేసుకోవడం అన్నమాట. అప్పట్లో వాళ్లు ఏం తిన్నరంటే రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇవే తిన్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

వెంకట కృష్ణ చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజలు మండి పడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితులు రావడానికి ఆంధ్రాపాలకులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అప్పోసప్పో చేసి పంట పండించి, అమ్ముకుని కడుపు నింపుకుందామనుకే సమయానికి సరైన గిట్టు బాట ధర ఇవ్వక ఆంధ్రాపాలకులు నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు ఇక్కడి నుంచే గోదావరి జలాలు పోతున్న ఒక్క చుక్క నీరు కూడా రైతులు ముట్టుకోకుండా చేసి, ఆంధ్రాకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు తిని బతికిన వాళ్లు కూడా ఉన్నారని, కానీ అన్నం తినడం కోసమే బియ్యం పోసుకోరు అని నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ సంప్రదాయాలను అవమానించిన వెంకట కృష్ణ వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.

హఠాత్తుగా సత్యవాణి అనే ఓ మహాతల్లి గుర్తొచ్చింది…
రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతున్నప్పుడు దేశపతి శ్రీనివాస్ అప్పట్లో ఏదో డిబేట్‌లో ఒడిబియ్యం అంటే ఏమిటమ్మా అని ఆమెను అడిగితే… బ్రహ్మానందం తరహాలో తుత్తుత్తూ అని ఏదో చెప్పబోయింది… నిజానికి ఆమెకు కూడా ఏమీ తెలియదు… ఈ గడ్డ మీద బతకడం తప్పితే..! ఆంధ్రాలో అసలు ఆ సంప్రదాయమే లేదు… ఒడిబియ్యం అంటే వాళ్లకు తెలియదు… తెలియకపోవడం, ఆ సంప్రదాయం లేకపోవడం తప్పు కాదు, ఒక ప్రాంత ఉత్కృష్ట సంప్రదాయాన్ని, అదీ ఆడబిడ్డలకు సంబంధించిన ఓ ఆనవాయితీని వెక్కిరించడం తప్పు, తప్పున్నర…

ఒడిబియ్యం పోయడం అంటే… దిక్కులేక ఆ ఒక్కరోజు బియ్యం వండుకుని పండుగ చేసుకోవాలంటూ చెప్పడం కాదు… పాపం, చాలామంది ఆంధ్రా సెటిలర్ల పిల్లలు తెలంగాణలోనే పుట్టి పెరిగినా సరే, తెలంగాణను ఓన్ చేసుకోకపోవడం, ఈ గడ్డ సంస్కృతిని పట్టుకోకపోవడం ఇది.

పెళ్లిరోజే తొలి ఒడిబియ్యం పోస్తారు ఆడబిడ్డకు… తరువాత పండుగలకు, పబ్బాలకు… నిర్ణీతకాలంలో అయిదేళ్లకోసారి తప్పనిసరిగా అల్లుడిని, బిడ్డను పిలిచి ఒడిబియ్యం పోస్తారు… ఒడిలో బియ్యం పోయడం అంటే కేవలం ఓ నాలుగు సేర్ల బియ్యం పోయడం కాదు… కొత్త బట్టలు పెట్టడం, కట్నం పెట్టడం… చుట్టుపక్కల ముత్తయిదవలు వచ్చి తలా కొన్ని బియ్యం ఆడపిల్ల ఒడిలో పోయడమే ఒడిబియ్యం… వాళ్లు ఇంటికి వెళ్లి ఆ బియ్యాన్ని వండుకుని, చుట్టాలను పిలుచుకోవడం… పుట్టింటివారు కూడా హాజరు కావడం… తండ్రి లేకపోతే సోదరులు పోస్తారు… అది మేమున్నామనే భరోసాను పుట్టింటి తరఫున ఇవ్వడం… నీ బట్టకూ, నీ పొట్టకూ నాదీ రక్ష అని తండ్రి లేదా సోదరుడు ధీమా ఇవ్వడం… ప్రతి ఆడబిడ్డకూ పుట్టింట్లో ఒడిబియ్యం పోసుకోవడం ఓ ప్రివిలేజ్ మాత్రమే కాదు… ఓ రక్షణ, ఓ హామీ, ఓ పూచీకత్తు… తల్లీ, నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, మేమున్నామనే ఓ వెన్నుదన్ను అది…

దాన్ని ఇంత నీచంగా వెటకరించడం దేనికో వెంకటకృష్ణే చెప్పాలిక… తెలియకపోవడం కాదేమో ఇది… తెలిసీ ఇంకేదో ప్రయోజనం కోసమా..?!

1 COMMENT

Comments are closed.