ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న గంగవ్వ కామెడీ వీడియోలు మీరందరు చూసే ఉంటారు. తాజాగా ఆమె బేబి అక్కినేని సమంతని ఇంటర్వ్యూ చేసింది. అచ్చ తెలంగాణలో ముక్కుసూటిగా మాట్లాడే గంగవ్వకి ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అయ్యారు. పలు విషయాలపై ఫన్నీ ప్రశ్నలు అడిగిన గంగవ్వకి సమంత సమాధానాలు ఇచ్చింది. సమంత కూడా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో గంగవ్వ ట్రూ రాక్ స్టార్ అనే కామెంట్ పెట్టి వీడియో షేర్ చేసింది. షూటింగ్ సమయంలో చాలా ఫన్ జరిగిందని కూడా పేర్కొంది.
ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ ఇంటర్వ్యూ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమంత నటించిన తాజా చిత్రం ఓ బేబి కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ నటి లక్ష్మీ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. రాజేంద్రప్రసాద్ సమంతకు స్నేహితుడిగా, రావు రమేశ్ కుమారుడిగా, మాస్టర్ తేజ మనవడిగా కన్పించనున్నారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.