అవినీతి భయంతోనే అరెస్టులు – బీజేపీ జిల్లా అధ్యక్షుడు

240
Peddapalli BJP district president

పెద్దపల్లి జిల్లాలో బిఆర్ఎస్ మంత్రుల పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ గారిని అరెస్టు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేశారు.

ఈ అక్రమ అరెస్టులపై బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ గారు విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను రాత్రి 12 గంటల నుండే పోలీసులు వారి యొక్క నివాసంలోకి వెళ్లి అక్రమంగా, దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

బిఆర్ఎస్ మంత్రులారా ఖబర్దార్

మీరు పర్యటనల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారంటే మీకు ఎంత భయం పట్టుకుందో తెలుస్తుందని వారు అన్నారు. మీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అవినీతిని బిజెపి నాయకులు బయట పెడతారనే భయంతోనే ఈ బిఆర్ఎస్ నాయకులు కావాలనే మరీ మరీ అరెస్టులు చేయిస్తున్నారు.

ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేయడం చేతకాదు కానీ ఎక్కడ ప్రారంభోత్సవాలు జరిగిన, మంత్రులు వచ్చినా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. మీరు బిజెపి కార్యకర్తలను ఎంత అరెస్టు చేసిన మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని వారు అన్నారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పెద్దపెల్లి జిల్లాలో అరెస్టు చేసి ఒక ఖైదీల లాగా వేరే జిల్లాలకు అక్రమంగా తరలించి పోలీసులను బిఆర్ఎస్ కార్యకర్తల లాగా వాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మీ యొక్క ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులై మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని వారు హెచ్చరించారు.