ప్రముఖ TV యాంకర్ రాధిక ఆత్మహత్య

4440
TV anchor Radhika Reddy commits suicide

ప్రముఖ యాంకర్ రాధిక ఆత్మహత్య చేసుకున్నారు. రాధిక ఓ పేరుగాంచిన ప్రైవేట్ చానెల్‌లో న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని సుశీల్ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి దూకి రాధిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడే ముందు రాధిక ఆఫీసు నుంచి ఇంటికి వచ్చినట్లు సమాచారం.

రాధికకు భర్త, కుమారుడు ఉన్నారు. కొడుకు మెంటల్‌‌గా ఎదగలేదని సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. కాగా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాధిక ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న తోటి మిత్రులు, ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. మీడియాలో చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రాధిక ప్రముఖ యాంకర్‌గా ఎదిగారు.