బిగ్ బాస్ బ్యూటీకి స్వదస్తూరితో పవన్ లెటర్… వైరల్

311
Bigg Boss 3 Himaja Got Movie Chance To Act With Pawan Kalyan

బిగ్ బాస్ బ్యూటీ హిమజ ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని పవన్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

పవన్- క్రిష్ కాంబోలో రాబోతున్న కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది.

తాజాగా మరో స్పెషల్ పోస్ట్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ బ్యూటీ.

తనకు పవన్ కళ్యాణ్ ఓ లెటర్ ఇచ్చారని తెలుపుతూ ఆ లెటర్‌ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.

ఈ లెటర్‌లో ”హిమజ గారికి అన్నీ శుభాలు కలగాలని, ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్” అని రాసి ఉంది.

ఈ పదాలు స్వయంగా పవన్ తన చేతి రాతతో రాశారట. దీంతో ఈ కాగితాన్ని అభిమానులతో పంచుకుంది హిమజ.

“ఇది చూశాక నా ఫీలింగ్స్ వ్యక్తపరిచేందుకు ఎలాంటి పదాలు, ఎమోజీలు సరిపోవు” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘స్వయంవరం’ అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచమైన హిమజ.. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే సీరియల్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ”శివమ్, నేను శైలజ, ధృవ, శతమానంభవతి, స్పైడర్, ఉన్నది ఒకటే జిందగీ, వినయ విధేయ రామ, చిత్రలహరి” లాంటి ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.

బిగ్ బాస్ మూడో సీజన్‌లో హంగామా చేసి తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ 27వ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా ‘జ’ అనే మూవీలో హీరోయిన్‌గా లీడ్ రోల్ పోషిస్తోంది.

జై దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై గోవ‌ర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రతాప్ రాజ్ హీరోగా నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో హిమజ పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించి ఆకట్టుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Himaja💫 (@itshimaja)