ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ వ్యాపారవేత్త రామ్ తో ఆమె రెండో పెళ్లి ఘనంగా జరిగింది. రామ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సునీత రోజు కో టాపిక్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
మరోవైపు కెరీర్ పరంగా ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఒక టీవీ చానల్ వాళ్లు ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆమెను ఆహ్వానించారు.
హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్టులో ఆ కార్యక్రమం జరగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో గీత కార్మికులు తాటి కల్లును తీస్తున్నారు.
దీంతో సునీతతో పాటు యాంకర్ భార్గవి తదితరులు సరదాగా కల్లు టేస్ట్ చూశారు.
గ్లాసుల్లో కల్లు పోయించుకుని తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.