బిగ్‏బాస్ విన్నర్ అభిజీత్‏కు వ‌రుస ఆఫ‌ర్లు

640

బిగ్‌బాస్ తెలుగు ఎంతో మంది యువ‌తీ యువ‌కుల‌కు గుర్తింపునిచ్చింది.

అప్ప‌టి వ‌ర‌కు కెరీర్ గ్రాఫ్ స‌రిగాలేకపోయినా బిగ్‌బాస్‌లో అడుగుపెడితే వారి జాత‌క చ‌క్ర‌మే మారిపోతుంది.

ఈ కోవ‌కు చెందిన వ్య‌క్తే సీజ‌న్ 4 విజేత అభిజీత్‌. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అతని ఆట తీరుతో విపరీతమైన పాపులారిటీని సంపాదించారు.

అభిజిత్ బిగ్‏బాస్‌కు వెళ్ళకు ముందే శేఖర్ కమ్ముల తెరెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో గుర్తింపు పొందాడు.

ఆ సినిమా తర్వాత అభిజిత్ అంతగా సినిమాల్లో నటించలేదు. చాలా కాలం తర్వాతా బిగ్‏బాస్ షోలో పాల్గోని మరింత ఫేమస్ అయ్యాడనడంలో సందేహం లేదు.

హౌస్‌లో నిజాయతీగా ఆడడం అతని ఆలోచన విధానామే అభిజీత్‌ను విజేతగా నిలబెట్టాయి. బిగ్‏బాస్ ఫైనల్ తర్వాత కంటెస్టెంట్లందరూ ఎప్పుడోకప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు.

కానీ అభిజీత్ మాత్రం సోషల్ మీడియా దరిదాపుల్లోకి రావడం లేదు. ఇప్పటికే బిగ్‏బాస్ కంటెస్టెంట్లలో అరియానా, సోహైల్, అఖిల్, మోనాల్ వంటివారు వరుస సినిమా ఆఫర్లతో దూసుపోతున్నారు.

కానీ అభిజీత్ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా అభిజీత్ గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ ఈ బిగ్‏బాస్ విజేతతో ఏకంగా మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 2019లో మన్మథుడు, గతేడాది లూజర్ అనే వెబ్ సిరీస్ విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి.

తాజాగా అబిజీత్‌తో కలిసి మూడు సినిమాలను నిర్మించనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.

ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ నూతన దర్శకుల కోసం వెతుకులాట ప్రారంభించిందట.

సరైన డైరెక్టర్స్ దొరక్కగానే అభిజీత్ సినిమాలు పట్టాలెక్కనున్నట్లుగా తెలుస్తోంది.