
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సాయంత్రం నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ తనిఖీలు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందుల గురించి వాహనదారులు వెల్లడించారు. వారు తమ ఇబ్బందులను వివరిస్తూ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
మరోవైపు పలు పత్రికల్లో ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన వార్తలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
దీంతో రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని ట్రాఫిక్ విభాగం భావించింది.
రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు.
అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఆధికార వర్గాలు వెల్లడించాయి.