రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం

178
బీసీ సాధికారత కులాల సమితి

తేదీ 11.02.2023 శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు బీసీ సాధికారత కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రవేశపెట్టిన ₹6229 కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో 2% మాత్రమే ఉండటం అందులోనూ ఫెడరేషన్ల ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

చర్చ గోష్టిలో తెలంగాణలోని వివిధ అనగారిన ఎంబిసి కులాలు మరియు బీసీ ఫెడరేషన్ కులాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించడం జరిగింది. అసెంబ్లీలో అనగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఎన్నో పర్యాయాలు మంత్రులకు ఎమ్మెల్యేలకు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క అంశాల్లో కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా స్పందించకపోవడం చాలా దురదుష్టకరమని రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు అన్యాయం జరుగుతుందని భావించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి బీసీ వర్గాలకు సీట్లు కేటాయించే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తాం.

అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనగారిన అన్ని సామాజిక వర్గాల తరపునుండి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి అసెంబ్లీలో వాని వినిపించాలని అందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామని ఈ నెల 25-02-2023 నాడు ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద సామజిక వర్గాల జన చైతన్య దీక్ష చేపట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ఇంచార్జ్ ఎం భాస్కరుడు, రాష్ట్ర సలహాదారులు మంగిలిపెళ్ళి శంకర్ గంగపుత్ర, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సంఘ వీరప్ప, రాష్ట్ర కార్యదర్శులు నర్సింగ్ గంగపుత్ర, రానా నగేష్ సింగ్, చేర్యాల రాకేష్, యశ్వంత్ నాయి, షేక్ ఇమామ్ పాషా, రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు కొత్తపల్లి బాయమ్మ, ఏపూరి శివరాం, కైరంకొండ రాజు, కుమ్మరి పి కుమారస్వామి, వికాస్ నాయి, పరమేష్ నాయి, నందు నాయి,ఎన్ రాజేష్, సురేష్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.