“చెక్” ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్… నితిన్ కు మరో భారీ ఫ్లాప్ తప్పదా ?

695
Check

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “చెక్”.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.

చదరంగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు భారీగా పడిపోయాయి.

తొలిరోజు కేవలం 3.5 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు నితిన్. గ్రాస్ 5.70 కోట్లు వచ్చింది.

ఈయన గత సినిమా భీష్మ తొలిరోజే 7 కోట్ల షేర్ తీసుకొస్తే.. అందులో సగం మాత్రమే చెక్ తీసుకొచ్చింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ టోటల్ కూడా 7.27 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. 17 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కనీసం 10 కోట్లు కూడా వసూలు చేసే తీరు కనిపించడం లేదు.

నితిన్‌ కెరీర్ లో ఈ చిత్రం మరో భారీ ఫెయిల్యూర్‌గా మిగలబోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ :

నైజాం: 2.40 కోట్లు

సీడెడ్: 80 లక్షలు

ఉత్తరాంధ్ర: 90 లక్షలు

గుంటూరు: 82 లక్షలు

ఈస్ట్: 32 లక్షలు

వెస్ట్: 50 లక్షలు

కృష్ణా: 43 లక్షలు

నెల్లూరు: 25 లక్షలు

AP/TS మూడు రోజుల కలెక్షన్స్: 6.42 కోట్లు షేర్
రెస్టాఫ్ ఇండియా: 40 లక్షలు

ఓవర్సీస్: 45 లక్షలు

వరల్డ్ వైడ్ 3 డేస్ టోటల్ షేర్: 7.27 కోట్లు