
నేడు దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
సోమవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదేనని అన్నారు.
వాక్సీన్‌ని తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చూడాలని విజ్ణప్తి చేశారు.
కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకుని తమను తాము కాపాడుకోవాలని అన్నారు.
తాను కూడా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు వ్యాక్సిన్ అందజేయాలని కోరారు.
కోవిడ్ కష్టకాలంలో ఫ్రంట్ లైన్‌లో ఉండి కృషి చేసిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు వ్యాక్సిన్ ఇప్పించాలని అన్నారు.