పెట్రోల్ పోసుకుని యువతి ఆత్మహత్య

149
Farmer suicide jumping flames

ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాత్ రూమ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ  యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకొంది.

గంధంగూడా వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముంటున్న దివ్య అనే యువతి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాత్ రూమ్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువతి ఆత్మహత్య చేసుకొంది.

బాత్ రూమ్‌లోనే యువతి కాలి బూడిదైపోయింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.