
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సొమవారం (1-3-2021) జడ్పీహెచ్ స్కూల్ కనూర్‌లో మల్లన్న కొంత మంది అధ్యాపకులతో ముచ్చటించారు.
తన పేరును పరిచయం చేసుకున్న మల్లన్న తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. తొలి ప్రాధాన్యత ఓటు తనకే వేయాలని వారిని కోరారు.
బ్యాలెట్ పేపర్‌లో తన పేరు తీన్మార్ మల్లన్నగానే ఉంటుందన్నారు. సీరియల్ నంబర్ 39 అని చెప్పారు. 2015లో ఇదే నియోగకవర్గం నుంచి పోటీ చేశానని.. అప్పట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారని మల్లన్న వివరించారు.
గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కోట్లు సంపాదించగా.. ఓడిపోయిన తనపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారని తెలిపారు.
పట్టభద్రుల కోసం పనిచేసే వారు ఎవ్వరూ లేరని చెప్పిన మల్లన్న మన కళ్లెదుటే ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, ఆర్టీసీని నాశనం చేశారని అన్నారు.
ఏ వ్యవస్థ పాడైపోయినా అంతగా ప్రభావం చూదలు కానీ విద్యావ్యవస్థ పాడైతే సమాజానికి మరింత ప్రమాదమని మల్లన్న చెప్పారు.
అంతేకాకుండా తాను ఓట్ల కోసం ప్రజల ముందుకు రాలేదని.. చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నానని తెలిపారు. మీరు వేసే ఓటు నాకు మరింత బలమిస్తుందిని, మరింత గట్టిగా పోరాడతానని అన్నారు.
పార్టీలు, కులాలు, మతాలు చూడటం లేదు. ప్రజల కోసమే ఈ తీన్మార్ మల్లన్న పోరాతున్నాడని ఆయన చెప్పారు. టీచర్లు ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మల్లన్న మాట్లాడారు.
అందుకే శాశ్వత పరిష్కారం చూపాలని తాను పోరాడుతున్నట్టు తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భయపడేవారు.
కానీ ఇప్పుడు అనేక మంది ధైర్యంగా ప్రశ్నించేలా మార్పును తీసుకువచ్చిండు తీన్మార్ మల్లన్న అని చెప్పారు.
ఒక్కసారి ఒక పదవి ఇచ్చి చూడండి.. తీన్మార్ మల్లన్న పోరాటం ఎలా ఉంటుందో మీరే చూస్తారని ఉపాధ్యాయులను మల్లన్న కోరాడు.