ఆత్మహత్య చేసుకుంటున్న కుక్క‌లు

631

జీవితం మీద విర‌క్తి చెందో మ‌రే కార‌ణం చేత‌నో మ‌నుషులు ఆత్మ‌హత్య‌లు చేసుకోవ‌డం మ‌నం చూశాం.

కానీ కుక్క‌లు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చూశారా? క‌నీసం విన్నారా? ఇదిగో కుక్క‌లు ఆత్మ‌హ‌త్య చేసుకునే వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ బ్రిడ్జి వద్దకు వెళ్తే కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయి. బ్రిడ్జి ఎక్కి అమాంతం కిందకు దూకి చనిపోతాయి.

ఒక వేళ గాయాలు మాత్రమే అయితే మళ్లీ బ్రిడ్జిపైకి ఎక్కి దూకుతాయి.

గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. మరి కుక్కలు ఆత్మహత్య చేసుకునే సూసైడ్ స్పాట్ ఎక్కడుంది? అవి ఎందుకు చనిపోతున్నాయి?

మనుషులు ఆత్మహత్యలు చేసుకునే సూసైడ్ స్పాట్స్ గురించి విన్నాం. కానీ జంతువులకు కూడా ఓ సూసైడ్ స్పాట్‌ ఉందంటే నమ్మగలరా? అవును ఇది నిజం.

మీరు చూస్తున్న ఈ బ్రిడ్జి అదే. స్కాట్‌లాండ్‌లో ఓ చోట ఏటా కొన్నికుక్కలు ఆత్మహత్య చేసుకుంటున్నాయి.

డంబార్టన్ సమీపంలో ఉన్న మిల్టన్ గ్రామంలో ఓ బ్రిడ్జి ఉంది. ఆ ప్రాంతం కుక్కలు ఆత్మహత్య చేసుకునేలా ఆకర్షిస్తుంది.

1960 నుంచి ఇప్పటి వరకు సుమారు 600 కుక్కలు బ్రిడ్జిపై నుంచి దూకి చనిపోయాయి. ఈ బ్రిడ్జి పేరు ఓవర్టన్. 1859లో దీన్ని నిర్మించారు.

1950ల్లో ఇక్కడ ఓ కుక్క సూసైడ్ చేసుకోవడాన్ని తొలిసారి గుర్తించారు. 50 అడుగుల ఎత్తు ఉండే ఈ బ్రిడ్జి దగ్గరకు వచ్చే కుక్కలు ఒకే స్పాట్ దగ్గరి నుంచి కిందకు దూకినట్లు చెబుతారు.

కొన్నిసార్లు కుక్కలు చనిపోవు. దెబ్బలు మాత్రమే తగులుతాయి. అలాంటి కుక్కలు మళ్లీ బ్రిడ్జిపైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంటాయి.

అసలు కుక్కలు బ్రిడ్జి నుంచి ఎందుకు దూకుతున్నాయన్నది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. అక్కడ దుష్ట శక్తులు ఉన్నట్లు స్థానికులు భావిస్తారు.

1994లో ఓ వ్యక్తి తన కుమారుడిని బ్రిడ్జిపై నుంచి కిందకు తోసి చంపేశాడు. అతడు క్రీస్తు వ్యతిరేకి అని చెప్పాడు.

కొన్ని రోజుల తర్వాత తాను కూడా అక్కడి నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అక్కడ దెయ్యాలు తిరుగుతాయని స్థానికులు చెబుతారు.

ఇది కుక్కలకు సూసైడ్ స్పాట్‌గా మారడంతో అక్కడ కొన్ని సూచీలు కూడా ఉంచారు.

అక్కడి వచ్చే వారు తమ కుక్కలపై కన్నేసి ఉంచాలని బోర్డులు పెట్టారు.