మాట‌కారి మంగ్లీ

433

జాన‌ప‌దాల‌తో, తెలంగాణ యాస‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు అభిమానుల‌ను సంపాదించుకుంది మంగ్లీ.

ఒక న్యూస్ ఛానెల్ లో కెరీర్‌ని ప్రారంభించింది ఆమె. సారంగదారియా సాంగ్‌తో సంగీత ప్రేక్షకులను మళ్ళీ ఓ రేంజ్‌లో అలరిస్తున్నారు.

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి.

2020లో ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు.

అయితే ఈ స్థాయికి ఆమె అంత ఈజీగా చేరుకోలేదు. ఒక చిన్న తండాలో పుట్టిన మంగ్లీ ప్ర‌యాణంలో ఎన్నో కష్టాలు ఒడుదుడుకులు ఉన్నాయి.

తనకు ఎదురైన ప్రతి కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొంది. ఈరోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా మాట‌కారి మంగ్లీకి చెందిన కొన్ని అంశాలు…

మంగ్లీది అనంత‌పురం జిల్లా

మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె తాండలోని పేద బంజారా కుటుంబంలో జన్మించింది.

ఆ తండాలోనే 5వ తరగతి వరకూ చదువుకున్నారు. 6 నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది.

అనంతరం రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పాటలు పాడడం నేర్చుకుంది.

క‌ర్ణాట‌క సంగీతం కూడా వ‌చ్చు

ఆ సంస్థ ఆర్ధికంగా సపోర్ట్ ఇవ్వడంతో మంగ్లీ తిరుపతిలో క‌ర్ణాట‌క సంగీతం కూడా నేర్చుకుంది.

ఇక పదవ తరగతి తర్వాత ఎస్.వీ.విశ్వవిద్యాలయంలో మూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.

అదే ఆమె జీవితంలో ట‌ర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. సంగీతంపై పట్టు పెంచుకున్న మంగ్లీ తిరుపతిలోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది.

ప‌ల్లే పాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌

జానపదాల పాటలతో కెరీర్‌ మొదలు పెట్టిన‌ మంగ్లీ తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది.

ఇంకా చెప్పాలంటే చాలామందికి మంగ్లీ తెలంగాణ అమ్మాయి అనుకునేంతగా తెలంగాణ పల్లె పదానికి తనదైన ముద్ర వేసింది.

మొదట జానపద గీతాలతో కెరీర్ మొదలు పెట్టిన మంగ్లీ తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్‌లోకి ద్వారా జనాలకు పరిచయమైంది.

మంగ్లీ పేరంటేనే ఇష్ట‌మ‌ట‌

అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అంద‌రూ భావిస్తారు.

ఒకసారి ఓ ప్రముఖ మీడియా సంస్థలోని జానపద కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీని తర్వాత ఆ ఛానెల్‌లో యాంకరింగ్ ఆఫర్ ఇచ్చారు.

అలా సత్యవతి మంగ్లీగా మారింది. సత్యవతి పేరు కంటే వేరే పేరు ఎంచుకోమంటే మంగ్లీ అనే తన అమ్మ‌మ్మ పేరును ఎంచుకున్నారు.

ఆ పేరుతోనే ‘మాటకారి మంగ్లీ’ అనే కార్యక్రమం మొదలైంది.

తెలంగాణ గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేరిన మంగ్లీ

ఆ తర్వాత చేసిన ‘తీన్మార్ ‘ తీన్మార్ న్యూస్‘తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది.

అప్పుడే ఎంటర్‌టైన్మెంట్ యాంకర్‌గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది.

అయితే తనకు పేరు వచ్చింది కానీ ఇష్టమైన సంగీతానికి దూరం అవుతున్నా అనే ఫీలింగ్‌తో టివి షోల నుంచి బయటకు వచ్చింది.

ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్‌కు పాటలు పాడడం మొదలు పెట్టింది.

ఇక తెలంగాణా ఆవిర్భావం సందర్భంగా పాడిన “రేలా.. రేలా.. రే.” పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్‌ని చేసింది.

సినిమాల్లో అరంగేట్రం

శివయ్య సాంగ్స్‌తో పాటు బతుకమ్మ పాటలు కూడా మంగ్లీకి మంచి పేరు తెచ్చాయి.

సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది.

అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ ‘గోర్ జీవన్ ‘ అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

లంబాడీ ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది. కొన్ని సీరియల్స్‌లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది.