మ‌హిళ‌పై యాసిడ్ దాడి.. ప‌రారీలో నిందితుడు

250
Acid attack on woman ..Accused robbery

ప్రపంచ మహిళ దినోత్సవం రోజున మెదక్ జిల్లాలో దారుణం జరిగింది.

జిల్లాలోని  అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌లో ఓ వివాహితపై గుర్తుతెలియని దుండగులు యాసిడ్‌ దాడి చేసి పారిపోయాడు.

ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు బాధితురాలిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

బాధితురాలిది టేక్మాల్ మండ‌లం అంతాయిప‌ల్లి తండా అని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ‌కు ఎవ్వ‌రూ తీసుకోని చ‌ర్య‌లను తాము తీసుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వాలు చెప్పుకుంటున్నాయి. మ‌హిళా దినోత్స‌వం రోజే మ‌హిళ‌పై యాసిడ్ దాడి జరగడం గమనార్హం.