అకస్మాత్తుగా కారులో చెలరేగిన మంటలు..!

206
Car fires .. Missed big accident!

హైదరాబాద్ నగరంలో రోడ్డుపై వెళుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నగరంలోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద జరిగింది.

వెంటనే ట్రాఫిక్ సిబ్బంది ప్రతిస్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ మంటలను చూసిన మిగతా వాహనదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

సమయానికి ట్రాఫిక్ సిబ్బంది సంఘన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే మంటలు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ప్రమాదంతో సమీపంలోని వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.