నిరూపించకపోతే అమిత్ షాపై కేసు వేస్తా: మాజీ సీఎం

124
case file Amit Shah if not proved: Former CM

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణస్వామి విరుచుకుపడ్డారు.

కరైకల్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తనపై అమిత్ షా తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు.

తన ప్రతిష్ట దెబ్బతినేలా అమిత్ షా వ్యాఖ్యానించారని ఆయన మండిపడ్డారు.  అమిత్ షాపై పరువునష్టం దావా వేస్తానని నారాయణస్వామి చెప్పారు. తనపై షా చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

పుదుచ్చేరికి ప్రధాని మోదీ రూ. 15,000 కోట్లు పంపారని, ఆ మొత్తంలో నారాయణస్వామి కోత పెట్టి, గాంధీ కుటుంబానికి చేరవేశారని అమిత్ షా ఆరోపించారు.

అమిత్ చేసిన వ్యాఖ్యలను తాను సవాల్ చేస్తున్నానని నారాయణస్వామి చెప్పారు.

తనపై చేసిన ఆరోపణలను ఆయన తక్షణమే నిరూపించాలని అన్నారు. ఆరోపణలను నిరూపించలేకపోతే పుదుచ్చేరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని స్వామి డిమాండ్ చేశారు.