స్కూల్ బస్సులకు ఎల్లో క‌ల‌రే ఎందుకు?

272

ఒక‌ప్పుడు స్కూలు, కాలేజీ బ‌స్సులు ఇష్ట‌మొచ్చిన రంగులు వేసుకుని ఆ స్కూలు లేదా కాలేజీ పేర్ల‌తో రోడ్డ‌పైకి వ‌చ్చేవి. దీంతో ఏది స్పూలు బ‌స్సో ఏది ప్రైవేటు బ‌స్సో అర్థ‌మ‌య్యేది కాదు.

అయితే ప్ర‌భుత్వాలు వాటిని స‌రైన దారిలో పెట్టాయి. ఏ స్కూల్ లేదా కాలేజ్ బ‌స్ అయినా ప‌సుపు రంగు వేసుకోవాల్సిందే అనే రూల్‌ను తెచ్చాయి.

దీంతో ప్ర‌స్తుతం విద్యాసంస్థ‌ల బ‌స్సుల‌న్నీ ఎల్లో రంగు వేసుకుని తిరుగుతున్నాయి. అయితే ఈ బస్సులు ఎల్లో కలర్‌లోనే ఎందుకు ఉంటాయో చాలామందికి తెలియదు.

స్కూల్ బస్సులు ఎల్లో కలర్ లో ఉండటం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా అన్ని రంగులలో కెల్లా మొదటగా అందరి దృష్టిని ఆకర్షించేది ఎల్లో.

అయితే రెడ్ మరియు వైట్ కరల్స్ దూరం నుంచి అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. రెడ్ కలర్ అనేది అత్యవసర సమయాల్లో సంకేతంగా ఉపయోగిస్తారు.

క‌నుక రెడ్ కలర్ స్కూల్ బస్సులకు ఉపయోగించడం అంత మంచిది కాదు. ఎల్లోకు అన్ని రంగులల్లో కంటే కొంత ప్రత్యేకంగా ఉంటుంది.

ఒక్క‌సారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. నిత్యజీవితంలో కూడా రంగుల విషయానికి వస్తే ఎల్లో కలర్ కంటికి ఎక్కువగా క‌నిపిస్తుంది.

ఈ కారణంగా స్కూల్ బస్సులకు ఎల్లో కలర్‌ను పెట్టారు ఉపయోగిస్తారు. అంతే కాదు ఎంత దూరం నుంచైనా ఈ రంగుని గుర్తించవచ్చు.

గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే స్కూల్ బస్సుల కలర్ వెనుక ఒక సీక్రెట్ కూడా ఉంది.

పొగమంచు, మంచు మరియు వర్షం వంటి సమయాల్లోనూ ఎల్లో కలర్‌ను సులభంగా గుర్తించొవచ్చు.

అంతేకాకుండా మనం అనేక రంగులను కలిసి చూసినప్పుడు ఎల్లో కలర్ మొదట మన చూపును ఆకర్షిస్తుంది.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఎల్లో కలర్ పార్శ్వ దృష్టి రెడ్ కలర్ కంటే 1.24 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే యెల్లో కలర్ మిగిలిన కలర్స్‌తో పోలిస్తే 1.24 రెట్లు ఎక్కువ ఆకర్షణను కలిగి ఉంటుంది.

ఇతర రంగుల కంటే ఎక్కువ దృశ్యమానతను కలిగి ఇది ఉంటుంది. 2012 సంవత్సరంలో పాఠశాల బస్సులకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది.

అవి ఏమిటంటే బస్సు మీద స్కూల్ పేరును మరియు ఆ స్కూల్‌కు సంబంధించిన ప్రిన్సిపాల్ యొక్క మొబైల్ నంబర్ వంటి వాటిని తప్పకుండా ప్రింట్ చేయాలి.

అంతేకాకుండా స్కూల్ బస్సులో ఫస్ట్ ఎయిడ్ స్పెషాలిటీ వంటివి కూడా కల్పించాలి.