గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యంగ్ హీరో కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ లో చిందేసింది.
“పైన పటారం” ఐటమ్ సాంగ్ లో మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు హీరో కార్తికేయ, యాంకర్ అనసూయ సిద్ధమయ్యారు.
తాజాగా మాస్ సాంగ్ “పైన పటారం” లిరికల్ వీడియోను విడుదల చేశారు.
అనసూయ ఐటం సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ “పైన పటారం” లిరికల్ వీడియోను వీక్షించండి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మై నేమ్ ఈజ్ రాజు అనే పాటకు అనూహ్య స్పందన లభించింది.
ఈ సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని మార్చి19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.