సందీప్ కిషన్ ను “అన్న” అనేసి నాలుక కరుచుకున్న లావణ్య త్రిపాఠి…!

485
Lavanya Tripathi Calls Sundeep Kishan As Brother In A1 Express Pre Release Event

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది.

ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి వచ్చీరానీ తెలుగును బాగానే మాట్లాడారు. “ఎ1 ఎక్స్‌ప్రెస్ నా మనసుకు నచ్చిన సినిమా.

డెన్నిస్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమా కోసం నేను హాకీ నేర్చుకున్నాను. బైక్ నడపడం కూడా నేర్చుకున్నాను.

కొవిడ్ టైమ్‌లో చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా మా అందరికీ చాలా ఎమోషనల్ మూమెంట్.

ఇక “సందీప్ అన్న గురించి చెప్పాలంటే” అంటూ సందీప్ కిషన్ వైపు చూసిన లావణ్య త్రిపాఠి వెంటనే.. “నాట్ అన్న, సారీ సారీ” అని గట్టిగా నవ్వారు.

అక్కడే ఉన్న హీరో రామ్ కూడా నవ్వుకున్నారు. మరోవైపు ఆడియన్స్ ఒకటే అరుపులు. దీంతో లావణ్య “మీ అన్న.. నా అన్న కాదు. నాకు ఫ్రెండ్” అంటూ కవర్ చేశారు.

ఈ విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.