క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న హేమ‌మాలిని

579
Hemamalini taken Covid Vaccine

దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు.

ముంబైలోని కూప‌ర్ ఆస్ప‌త్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంత‌రం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీట్ చేశారు.

జ‌న‌వ‌రి 16 నుంచి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది టీకాలు వేశారు.

అనంతరం పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌లు ఇచ్చారు. 60 ఏళ్ల వ‌య‌సు దాటిన వారికి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.

మార్చి 1 నుంచి 60 ఏండ్లు పైబ‌డిన వారికి, 45 ఏండ్లు పైబ‌డిన దీర్ఘ‌కాలిక రోగుల‌కు టీకాలు ఇస్తున్నారు.

ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రి, టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ కరోనా టీకా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.