“ఓ మంచి రోజు చూసి చెప్తా” టీజర్… దామూ నేనే, సోమూ నేనే అంటున్న విజయ్ సేతుపతి

677
First look poster of O Manchi Roju Chusi Chepta

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రధారులుగా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్’.

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ మొత్తానికి సొంతం చేస్తున్నారు.

ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” పేరుతో విడుదల చేస్తున్నారు.

గాయత్రీ శంకర్, విజి చంద్రశేఖర్, రమేష్ తిలక్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా “ఓ మంచి రోజు చూసి చెప్తా” టీజర్ విడుదల చేశారు.

టీజర్ లో దాము విలనా, సోము విలనా? అంటూ ప్రేక్షకులను మేకర్స్ కాస్త తికమక పెట్టారనే చెప్పొచ్చు. అయితే దామూ నేనే, సోమూ నేనే అని విజయ్ సేతుపతి చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

ఇంతవరకు తమిళ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘ఉప్పెన’తో డైరెక్ట్ తెలుగు సినిమా చేసి ఇండస్ట్రీలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యారు.

విజయ్ సేతుపతి తమిళంలో ఒకవైపు హీరోగా నటిస్తూనే నెగిటివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.

దీంతో ఆయన నటించిన పాత తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు.