
వాటర్ ట్యాంకులో పడి తాతామనవడు ఇద్దరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే జైసల్మేర్ జిల్లా నోఖ్ ఏరియాలోని ఓ ఇంట్లో రావల్ సింగ్ (11) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకులో పడిపోయాడు.
ఇది గమనించిన అతని తాత కూప్ సింగ్ (55) మునిగిపోతున్న మనుమడిని కాపాడేందుకు ట్యాంకులో దూకాడు.
అయితే రావల్ సింగ్ భయంతో తాతను బిగ్గరగా చుట్టుకోవడంతో కూప్‌సింగ్‌కు ఈదడం సాధ్యంకాక ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు.
చుట్టుపక్కల ఉన్నవారు వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.