
పాలు మంచి పౌష్టికాహారం. అందుకే చిన్న పిల్లలకు, వృద్ధులకు బలం కోసం ప్రతి రోజూ పాలను ఇస్తుంటాం. పూర్వం స్వచ్ఛమైన పాటు దొరికేవి.
గేదెలను మనింటి వద్దకే తీసుకొచ్చి మన కళ్లెదుటే పితికి పాలు పోసేవారు. కానీ ఇప్పుడు పాలల్లో ఎంత స్వచ్ఛత ఉంది అంటే చెప్పడం కష్టమే.
ఈ మధ్యకాలంలో పండ్లు, నూనె, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, పాలు.. దేన్నైనా ఈజీగా కల్తీ చేసేస్తున్నారు.
ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. హోటళ్లు, టీ స్టాళ్లులలో వాడే పాలు 100శాతం ప్రాసెస్ చేసినవే.
మనం వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాలపొడిని ఈ విధంగా తయారు చేస్తున్నారు. మొదటగా సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్లు, కొవ్వు, నీటిని వేరుచేస్తారు.
వేరు చేసిన కొవ్వును ఐస్‌క్రీమ్ కంపెనీలకు అమ్ముతారు. మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి పాశ్చరైజేషన్ ద్వారా అందులోని సూక్ష్మ జీవులను చంపేస్తారు. పాల తయారీకి మూలమైన పాలపొడిని ఈ విధంగా తయారు చేస్తారు.
చిన్న రంధ్రం ద్వారా ఎక్కువ ఒత్తిడితో పాలను గాలిలోకి పిచికారి చేస్తారు. దీని వల్ల పాలు ఎండి పాలపొడిగా మారుతుంది.
ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోకి నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. ఈ విధంగా తయారైన ఆక్సిడైజ్ కొలెస్ట్రాల్ మానవ శరీరంలోని రక్తనాళాలను తొందరగా మూసివేసి గుండె, రక్తనాళాల జబ్బులకు కారణమవుతుంది.
తక్కువ కొవ్వు ఉండే పాలు గుండె జబ్బులకు మంచిదని ప్యాకెట్ పాలను వాడుతుంటే వాటి వల్లే గుండె జబ్బులు అధికమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు మానవ శరీరంలో తీవ్రమైన నష్టాలను కలిగిస్తున్నాయి. కృత్రిమ పాలు, కల్తీ పాలు మానవశరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఈ కృత్రిమపాలు ప్యాకెట్ పాల కంటే మరీ ప్రమాదకరం. విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మానవునిలోని ప్రతి అవయవం దెబ్బతినే అవకాశముంది.
యూరియా, ఇతర రసాయనాల ద్వారా కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ పాలను చిన్న పిల్లలు తాగడం వల్ల వాంతులు, వీరేచనాలతో అస్వస్థతకు గురవుతారు.
జీర్ణకోశ వ్యాధులతోపాటు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశముంది.