“అరేయ్ ఏంట్రా ఇది”… యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ షణ్ముఖ్ పై ట్రోలింగ్

439
YouTuber Shanmukh held for rash driving

నిత్యం యూట్యూబ్ లో లీనమయ్యే వాళ్ళకు, దాదాపు తెలుగు ప్రేక్షకులకు అందరికీ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు షణ్ముఖ్ జస్వంత్.

ఈ మధ్యే సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో స్టార్ అయిపోయాడు షణ్ముఖ్ జస్వంత్.

ప్రస్తుతం ఈయన సూర్య అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న గుర్తింపు ఒక్కసారిగా నేలకొరిగింది.

సరిగ్గా ఇలాంటి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటం.. యాక్సిడెంట్ చేయడం లాంటివి షణ్ముఖ్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీశాయి.

తన స్నేహితులలో ఒకరితో వచ్చిన గొడవ కారణంగానే ఈయన మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ చేసిన కారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వాహనాన్ని సీజ్ చేసి షణ్ముఖ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రెండు కార్లు రెండు బైకులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.

అయితే షణ్ముఖ్ ఓ వీడియోలో మాట్లాడుతూ… కార్ యాక్సిడెంట్ లో తన తప్పేమి లేదని, తాను కావాలని అలా చేయలేదని,

మీడియాలో వస్తున్నట్టుగా అసలెవరికీ గాయాలు కాలేదని, అంతేకాకుండా తనవల్ల ఎవరినీ ఆసుపత్రిలో చేర్చలేదని వెల్లడించాడు.

“అరేయ్ ఏంట్రా ఇది” అనే డైలాగ్ తో ఫేమస్ అయిన షణ్ముఖ్ ను… ఇప్పుడు అదే డైలాగ్ తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గత 24 గంటల్లో ఈ కుర్రాడి వార్త ట్రెండింగ్ గా మారింది.

అయితే ఈ గొడవపై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ, షణ్ముఖ్ క్లోజ్ ఫ్రెండ్ మాత్రం సోషల్ మీడియాలో ఏవేవో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని,

అసలు జరిగిన యాక్సిడెంట్ లో షణ్ముఖ్ తప్పు లేనట్లుగా వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది అంటూ ఫైర్ అయ్యింది.