తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్‌ – మార్చ్ 1

620
morning news with teenmaar mallanna

సోమ‌వారం (1-3-2021) వ‌రంగ‌ల్ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న మార్నింగ్ న్యూస్ లైవ్ కొన‌సాగింది. ఈ న్యూస్ కొన‌సాగడానికి ముందు రంగారెడ్డి, మెద‌క్‌తో పాటు వివిధ జిల్లాల ప్రాంతాల వ‌చ్చిన అనేక మంది ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్‌లో కోర్సు విద్యార్థుల‌తో తాను కూడా ఇక్క‌డే 2011-2012 బ్యాచ్ అని చెప్పాడు. ప్ర‌తి మున్సిప‌ల్ ప‌రిధిలో మినీ స్టేడియాలు వ‌స్తాయ‌ని, పీఈటీ ఉద్యాగాలకు నోటిఫికేష‌న్ విప‌రీతంగా ప‌డ‌తాయ‌ని, అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌ను అంత‌ర్జాతీయ స్థాయికి ఆ త‌ర్వాత అంత‌రిక్షానికి తీసుకేళ్లేంత‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బిల్డ‌ప్ ఇచ్చిండు 2014 త‌ర్వాత ఒక‌సారి బిపెడ్ నోటిఫికేష‌న్ ప‌డింది. త‌ర్వాత విద్యారంగాన్ని, క్రీడారంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిండు. వంద‌లాది, వేలాది మంది విద్యార్థులు బిపిడ్ పూర్తి చేసుకున్నారు. వారికి ఉద్యోగావ‌కాశాలు ఇవ్వాల్సిందే. పీఈటీ నోటిఫికేష‌న్లు ప‌డితే వీళ్ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయి. దీంతో విద్యార్థులకు క్రీడ‌లు నేర్పే అధ్యాప‌క బృందం ప్ర‌భుత్వం దగ్గ‌ర ఉంటుంది. కానీ భ‌ర్తీ చేయ‌లేని ప‌రిస్థితికొచ్చింది. అంతేకాకుండా పీఈట‌ల‌ను ఆప్‌గ్రేడేష‌న్ చేస్తాన‌ని టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముందు కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కానీ అది చెత్త‌బుట్ట‌పాలైంది. విద్యారంగంలో వ్యాయామ విద్య అనేది చాలా ముఖ్య‌మైంది. కాక‌తీయ యూనివ‌ర్సిటీ బిపిడ్ కోర్సుకు చాలా పేరున్న యూనివ‌ర్సిటీ. ఇందులో చ‌దువుకున్న వాళ్లు చాలా మంది ప్ర‌భుత్వం ఉద్యోగాలు చేస్తున్నారని తాను మాత్రం కేసీఆర్ ఉద్యోగం ఊడ‌గొట్టే ప‌నిలో ఉన్నాన‌ని మ‌ల్ల‌న్న అన్నాడు.

తీన్మార్ మ్మ‌ల్ల‌న్న వార్తలు

ఇక ఈ రోజు ప‌త్రిక‌ల్లో ఫ్రంట్ పేజీలో వ‌చ్చిన వార్తా విశేషాల‌ను తీన్మార్ మ‌ల్ల‌న్న వివ‌రించారు.

ఈనాడులోని వార్త‌ల‌ను వివ‌రిస్తూ..

ఇస్రో గురించి వివ‌రించారు. ఇస్రో వాళ్లు ప్ర‌యోగించే రాకెట్లు స‌రిగ్గా క‌క్ష్య‌లోకి వెళ‌తాయి.. కానీ కేంద్ర ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేస్తే మ‌న ద‌గ్గ‌ర‌కు రావు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిదులు విడుద‌ల చేస్తే రావు. అవి క‌క్ష్య‌లోకి రావు. అవి క‌క్ష్య త‌ప్పిపోతూనే ఉంటాయి. అందుకు ఊదాహ‌ర‌ణ అంటూ వెలుగు దిన‌ప‌త్రిలో వ‌చ్చిన బ‌డ్జెట్ బారానా, ఖ‌ర్చు చారానా దారిత‌ప్పుతున్న ఎస్సీ ఎస్టీల ఫండ్స్‌. ఆర్థిక శాస్త్ర‌వేత్త‌లే ఉండాలే. ఐదో త‌ర‌గ‌తి చ‌దివినోడు ఆర్థిక మంత్రిగా ఉంటే ఎలా వ‌స్తాయి? అని మ‌ల్ల‌న్న ప్ర‌శ్నించాడు. అంత‌రిక్షంలో అవ‌కాశాలు చాలా ఉన్న‌య‌న్న వార్త చ‌దివిన మ‌ల్ల‌న్న కేసీఆర్‌ను ట్రై చేయ‌మ‌న్నాడు. అంతే లేని సొరంగం క‌థ వార్త‌ను చ‌దువుతూ రెండేళ్ల‌వుతున్నా సొరంగం పూర్తి కావ‌డంలో జాప్యం… ఇదే మాట 2014లో న‌ల్ల‌గొండ ఎన్జీ కాలేజీలో బాతాల పోషెట్టి (కేసీఆర్‌ను మ‌న్న‌ల్ల ముద్దుగా పిలుచుకుంటారు) ఏం చెప్పిండో మీకు గుర్తుందా అని ఆ సంఘ‌ట‌న‌ను గుర్తుకు తెచ్చారు. మ‌ల్ల‌న్న‌. ఎస్ఎల్‌బీసీ ఎలా పూర్తి కాదో నేను చూస్తా, ఎవ‌డు అడ్డుకుంటాడో చూస్తా అని అన్నాడు. అడ్డుకున్న‌దెవ‌రు? ఈ స‌న్నాసే. అక్క‌డే కుర్చీ వేసుకుని మ‌రీ క‌ట్టిస్తాన‌ని కేసీఆర్ చెప్పిండు. మ‌నిషి లేడు.. కుర్చీలేదు. ఇప్ప‌టికీ అది అట్టే ఉన్న‌ద‌ని మ‌ల్ల‌న్న వివ‌రించారు.

ఐటీ ఐఆర్, ఇవ్వండి కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌కు కేటీఆర్ లేఖ అనే వార్త‌పై మ‌ల్ల‌న్నస్పందించారు. ఈ డ్రామాలు మానేయ్ త‌మ్మి అంటూ కేటీఆర్‌కు హిత‌వు ప‌లికారు. వాళ్లు ప్ర‌క‌టించే టైమ్‌కు కేటీఆర్ లేఖ‌రాస్తాడ‌న్నారు. అంతేకాకుండా కేటీఆర్ వానొచ్చే టైమ్‌కు య‌జ్ఞాలు చేస్తాడ‌ని మ‌ల్ల‌న్న చె్ప్పారు. రాయితీకు సున్నం అనే వార్త‌పై మ‌ల్ల‌న్న స్పందిస్తూ.. రైల్వే శాఖ రాయితీల‌ను తీసేసిందంటూ వ‌చ్చిన వార్త‌ను మ‌ల్ల‌న్న దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్‌కు, న‌రేంద్ర మేడీకి పెద్ద తేడా ఏమీ లేద‌న్నారు. ఆయ‌న గుట్ట‌లు మింగుతుంటే.. ఈయ‌న బోర్లు మింగుతార‌ని చ‌మ‌త్క‌రించారు.
మ‌హ‌మ్మారికి ఏడాది అనే వార్త‌ను చూదువుతూ.. మ‌హ‌మ్మ‌రాకి ఏడాది.. బాతాల పోషెట్టికి ఏడేండ్లు అని మ‌ల్ల‌న్న అన్నారు. క‌రోనా కంటే అత్యంత ప్ర‌మాద‌ర‌క‌మైంది కారు పార్టీ అని చెప్పారు. పెట్రోల్ ధ‌ర‌ల గురించి మాట్లాడుతూ… బిడ్డా నిన్ను ధ‌ర్మం కాపాడ‌త‌ద‌ని చిన్న‌ప్పుడు అమ్మ చెబుతుండే.. కానీ న‌రేంద్ర మోడీ ఏమో ధ‌ర్మాన్ని నువ్వు కాపాడ‌మ‌ని చెబుతున్నాడ‌ని మ‌ల్ల‌న్న అన్నారు. ఏందో ఈ క‌థ అర్థం కావ‌డంలేదు. ఏమ‌న్న అంటే దేశ భ‌క్తిని తెర‌పైకి తీసుకొస్త‌రు. ఏదైనా మాట్లాడితే దేశ‌ద్రోహి అంటార‌ని చెప్పారు. ఇక్క‌డ పోటీ చేస్తున్న బుద్దుల ప్రేవేంద‌ర్ రెడ్డి త‌న పెట్రోల్ బంకులో రూ. 10 త‌క్కువ‌గా అమ్మొచ్చు కదా అని మ‌ల్ల‌న్న ప్ర‌శ్నించారు.

ఇక వెలుగు దిన‌ప‌త్రిక రాసిన వార్త‌లపై మ‌ల్ల‌న్న స్పందించారు. ఫ‌స్ట్ టీకా ఈట‌ల‌కు అన్న వార్త చ‌దివి.. రాజేంద్ర‌న్న టీకా వేసుకోవ‌ద్దు మొద‌ట కేసీఆర్‌కు వేద్దాం.. నా మాట విను అన్ని అన్నారు. కేసీఆర్ ఉన్నా లేక‌పోయినా ఒరిగేదేమీ లేదు కాబట్టి మొద‌టి టీకా ఆయ‌న‌కే వేయాల‌ని డిమాండ్ చెస్తున్న‌ట్టు మ‌ల్ల‌న్న చెప్పారు. బ‌డ్జెట్ బారానా.. ఖర్చు చారానా అనే వార్త‌పై మ‌ల్ల‌న్న స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి తీసుకుపోయి కాళేశ్వ‌రంలో పోసిండ‌ని అన్నారు. పేరు పెరుమాళ్ల‌ది.. ఆర‌గింపు అయ్య‌గారిద‌నే చ‌లోక్తు విసిరారు. రాబోయే బ‌డ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల‌కు రూ. 50 వేల కోట్ల‌ని ముక్కూసిపోయేత‌ట్టు చెబుత‌డు.. పెట్టుడే గానీ అమ‌లు చేసేది ఏమీ లేద‌ని మ‌ల్ల‌న్న అన్నారు. మిగిలిన నిధుల‌ను క్యారీ ఫార్వ‌ర్డ్ చేయాలి కానీ అది జ‌ర‌గడం లేద‌ని.. వాటిని బాతాల పోషెట్టి మింగేస్తున్నాడ‌ని మ‌ల్ల‌న్న విమ‌ర్శించారు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే.. క‌డుపులో పెట్టి చూసుకుంటా.. అనే వార్త‌ను చ‌దువుతూ… నిన్న (28-2-2021 ఆదివారం) ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి బ‌హిరంగ సభ‌ను ప్ర‌స్తావించారు. ఆ స‌భ‌కు గ్రాడ్యుయేట్స్ రాక కుర్చీలు ఖాలీగా ఉన్నాయంట‌. 10 వేల మందికి భోజ‌నాలు సిద్ధం చేస్తే 280 మంది తిన్నారంట‌. అందులో చెన‌గ‌లు, బ‌ఠాణీలు అమ్మేవాళ్లు 15 మంది ఉన్నారంట‌. ఈ వార్త చూసిన‌ప్ప‌టికీ వ్య‌తిరేక‌త త‌గ్గింద‌ని కేసీఆర్ చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని మ‌ల్ల‌న్న అన్నారు. అంతేకాదు మార్చి 14 త‌ర్వాత ఒక్కో నిరుద్యోగికి రూ. 5 ల‌క్ష‌లు ఇస్తామ‌న్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ చెప్పిన మాట‌ల వీడియోను చూపించారు. కేసీఆర్ ఏక్ నంబ‌ర్ ఎర్ర‌బెల్లి ద‌స్ నంబ‌ర్ అని మ‌ల్ల‌న్న అన్నారు. మెంబ‌ర్‌షిప్ తీసుకుంట‌నే పింఛ‌న్ ఇస్తారంట.. అనే వార్త‌ను చ‌దువుతూ.. మీ అయ్య జాగీరా అని మ‌ల్ల‌న్న ఘాటుగా స్పందించారు. ఇవేమైనా మీ జేబుకెల్లి ఇస్తున్నారా? అన్ని ప్ర‌శ్నించారు. ఇవేమైనా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పైస‌లా? లేక‌పోతే మంత్రులంతా కూలీకి పోయి తెచ్చిన పైస‌లా అని మ‌ల్ల‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల పైస‌లు ప్ర‌జ‌ల‌కియ్య‌డానికి త‌మాషా చేస్తున్నారేందిరా మీరంత అని అన్నారు. టీఆర్ఎస్ మెంబ‌ర్‌షిప్ అనేది భ‌గ‌వద్గీత బుక్కా అని చెప్పారు. పోర‌గాల్ల‌కు ముడ్డి తుడిచేందుకు కూడా ఆ కాగితం ప‌నికిరాద‌న్నారు. వ్య‌వ‌సాయ భూముల‌కు ఫుల్ డిమాండ్ అనే వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు. కేసీఆర్ బ్యాచ్ హైద‌రాబాద్‌లో 51 వేల ఎక‌రాల‌ను సంపాదించార‌ని అన్నారు. స‌గం హైటిక్ సిటీని డ్రామా రావు (కేటీఆర్‌) కంపెనీలు కొనేశాయ‌ని చెప్పారు. ఈ దోపిడీ దారుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌రుగుతున్న‌ది మామూలు యుద్ధం కాద‌ని మ‌ల్ల‌న్న అన్నారు

ఇక ఆంధ్ర‌జ్యోతి దిన ప‌త్రిక ప్ర‌ముఖ వార్తా విశేషాలపై మ‌ల్ల‌న్న స్పందిస్తూ.. రాకెట్‌లో మోడీ ఫోటోను అంత‌రిక్షానికి ఎందుకు పంపించార‌ని అడిగారు. దానికి బ‌దులుగా రూ.100కు లీట‌ర్ పెట్రోలు, రైల్వేలో రాయితీలు క‌ట్ వంటిటి పంపింటే బాగుండేద‌న్నారు. అంత‌రిక్షానికి మోడీ ఫొటో పోయి ఏంచేయాల‌ని మల్ల‌న్న ప్ర‌శించారు. న‌ల్ల‌ధ‌నం వాప‌స్ తేక‌పోతే కొట్టి చంప‌మ‌న్న మోడీ మాట‌ల‌ను మ‌ల్ల‌న్న గుర్తు చేశారు. న‌ల్ల‌ధ‌నం అటే పాయ‌, పెట్రోల్ ధ‌ర‌లు పెరిగిపాయ‌.. అచ్చే దిన్ అని స‌చ్చే దిన్ తెచ్చిండ్రు అని అన్నారు. కేసీఆర్‌ది కూడా ఒక‌టి తీసుకొని పోయివుంటే బాగుండేద‌న్నారు. నేటి నుంచి టీకా అనే వార్త‌ను చ‌దువుతూ.. కేసీఆర్‌కు టీకా వేస్తే బెట‌ర‌బ్బా అని అన్నారు. టీఆర్ఎస్ స‌భ్య‌త్వం కోరుతూ వ‌చ్చిన వాళ్ల‌కు టీకా వేయాల‌ని ఆయ‌న కోరారు. ఇక అవినీతి క‌మ‌లాలు.. ఇద్ద‌రు బీజేపీ నేత‌ల చీక‌టి డీల్‌.. ఢిల్లీ నేత‌ల ఆరా అనే వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దివి వినిపించారు. మంచిగ త‌యారైండ్రు.. ఏమి అవినీతి ఏం క‌థ అని స్పందించారు. గెలిచి తీరాలి అనే కేసీఆర్ వార్త‌ను చ‌దువుతూ.. ప‌ట్ట‌భ‌ద్రులారా మ‌నేం చేయాలి ఓడ‌గొట్టి తీరాలి అని మ‌ల్ల‌న్న పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేడ‌ని.. బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది.. మిగిలిన వాళ్లెవ్వ‌రూ గెల‌వ‌లేర‌న్న‌ కేసీఆర్ మాట‌లపై మ‌ల్ల‌న్న స్పందించారు. అయితే ఇంకెందుకు ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి గెలిచిన‌ట్టు కాగితం తెచ్చుకుంటే ఒడిసిపోత‌దిగా అన్నారు. ప‌ల్లా విజ‌యం త‌థ్యం అయినా తెలిగ్గా తీసుకోలేం అన్న కేసీఆర్ మాట‌ల‌ను మ‌ల్ల‌న్న చ‌మ‌త్క‌రించారు. గెలుపు త‌థ్య‌మైన‌ప్పుడు ఎందుకు తేలిగ్గా తీసుకోలేవ‌ని మ‌ల్ల‌న్న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను వివ‌రించండి అన్న ఆ వార్త‌లోని వాక్యాన్ని చ‌దివిని మ‌ల్ల‌న్న నేను చెబుతా తీ అంటూ ఏక‌రువు పెట్టారు.

ఆదాబ్ హైద‌రాబాద్ ప‌త్రికలో ప్ర‌ధాన శీర్షిక‌లో రాసిన క‌విత‌ను చ‌దివి వినిపించారు. వ‌ర్షం నీటిని ఒడిసి ప‌డ‌దాం.. త్వ‌ర‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క్యాచ్ ది రెయిన్ వార్త‌ను చ‌దివారు. ప్ర‌ధాని మాట‌లు అద్భుతంగా ఉంటాయి. ప‌దాలు అద్భుతంగా ఉంటాయి. నిర్భ‌ర్ భార‌త్ అని, మేకిన్ ఇండియా అని ఎన్నో మాట‌లు చెబుతారు కానీ వాస్త‌వానికి ఇక్క‌డేమీ ఉంద‌ని మ‌ల్ల‌న్న అన్నారు. దివిస్ నిర్వాకం.. స్వ‌చ్ఛ భార‌త్‌కు గండి అనే వార్త‌పై మ‌ల్ల‌న్ స్పందిస్తూ.. దివిస్ కంపెనీ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన కంపెనీ అని దాన్ని అర్జెంట్‌గా మూసేయాల‌ని అన్నారు. రేపు పాల‌మూరు నేత‌ల‌తో ష‌ర్మిల ఆత్మీయ స‌మ్మేల‌నం అనే వార్త‌ను చదువుతూ.. ఇది పెద్ద‌గ‌నే ఉంది క‌థ ఏమైత‌దో చూడాలి అన్నారు. టీఆర్ఎస్ వేగంగా ప‌త‌న‌మ‌వుతోంది.. అని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వార్త‌ను చ‌దివిన మ‌ల్ల‌న్న ముంగ‌ట ఓ చిలుక‌లు పెట్టుకోమ‌ని ఉత్త‌మ్‌కు స‌ల‌హా ఇచ్చారు. ఉత్త‌మ్‌, కేసీఆర్ మాట‌లు ఉద‌యం ఒక‌ర‌కంగా, సాయంత్రం మ‌రో ర‌కంగా ఉంటాయ‌న్నారు. ప‌ట్ట‌భ‌ద్రుల‌ను ఓట‌డిగే ద‌మ్ము టీఆర్ఎస్ నాయ‌కుల‌కు లేదు అన్న వార్త‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు. డిగ్రీ చ‌దువుకున్నోడు ఎవ‌డైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాడా అని ప్ర‌శ్నించారు.

సాక్షి దిన‌ప‌త్రిక వార్తా విశేషాల‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు. మోడీని ఆజాద్ ప్ర‌శంసించ‌డంపై మ‌ల్ల‌న్న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ ల‌వ్ స్టోరీ ఏందో అర్థమైత‌లేద‌న్నారు. ఆద‌ర్శం నుంచి అధోగ‌తికి.. దివాళా దిశ‌గా ఆర్టీసీ ప‌ర‌పితి సంఘాలు.. అనే వార్త‌ను చ‌దువుతూ.. కేసీఆర్ హ‌యాంలో ఆర్టీసి ప‌రిస్థితి ఇలా త‌యారైంద‌న్నారు. ప్ర‌ధ‌మ ప్రాధాన్య‌త ఓటు తోనే గెలుపొందాలి అన్న వార్తపై కూడా మ‌ల్ల‌న్న స్పందించారు. మాకు ఓటేమ‌ని ఎవ‌రైనా వ‌చ్చి అడుగుతున్నారా? అని ప్ర‌శ్నించారు.

మ‌ధ్య‌లో కేయూ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌ను చెప్పుకున్నారు. కాలేజీ బిల్డింగ్ ప్లాన్ ఒక రకంగా ఉంటే క‌ట్టించింది మ‌రోలా అని మ‌ల్ల‌న్న‌కు ఆ విద్యార్థులు చూపించారు. త‌మ‌కు ఫ్యాక‌ల్టీ, ల్యాబ్‌లు వ‌స‌తులు స‌రిగా లేవ‌ని గ‌త బుధ‌వారం నుంచి విద్యార్థులు నిర‌స‌న తెలుపుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఉన్న‌తాధికారుల నుంచి ఎటువంటి స్పంద‌నా లేదు. అయితే కేటీఆర్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విద్యార్థుల‌కు ఇచ్చిన హామీని కూడా మ‌ల్ల‌న్న చ‌దివి వినిపించారు. మొత్తానికి కాక‌తీయ యూనివ‌ర్సిటీని స‌ర్వ‌నాశనం చేశార‌ని మ‌ల్ల‌న్న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం కానీ, కేసీఆర్ గానీ ఇటువంటి ప‌నులు ఏమీ చేయరు. కేసీఆర్‌ను జాబ్‌లోనుంచి తీసేస్తే త‌ప్ప ఇవి ఇంప్లిమెంట్ కావ‌ని చెప్పారు. మ‌న ఓట్ల‌తో గ‌ద్దెనెక్కి మ‌న‌కు సౌక‌ర్యాలు ఇవ్వ‌న‌నే వ్య‌క్తిని మ‌న‌మెందుకు కొన‌సాగించాల‌ని ఆ విద్యార్థుల‌తో మ‌ల్ల‌న్న అన్నారు. నాయ‌కుడు ఓటుకు మాత్ర‌మే భ‌యప‌డ‌తాడ‌ని.. ఓటు కొట్టాల‌ని పిలుపునిచ్చారు.

న‌ల్ల‌బెల్లి మండ‌లం నుంచి వ‌చ్చిన కొంత మంది మ‌ల్ల‌న్న‌కు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలియ‌జేశారు. త‌మ భూమిని ఓ వ్య‌క్తి క‌బ్జా చేస్తున్నాడ‌ని మ‌ల్ల‌న్న‌కు ఫిర్యాదు చేయ‌గా.. వెంట‌నే సంబంధించిన ఎస్సైతో మాట్లాడి వీళ్ల‌కు న్యాయం చేయ‌మ‌ని అడిగారు. ఒక వ్య‌క్తి ఫోన్ ద్వారా త‌న స‌మ‌స్య‌లు మ‌ల్ల‌న్న‌కు వివ‌రించాడు. అంబేద్క‌ర్ ఓయూ స్కాల‌ర్‌షిప్ కింద ఎస్సీ, ఎస్టీ వాళ్ల‌కు రూ. 20 ల‌క్ష‌లు ఇస్తుండే వార‌ట‌. ఇప్ప‌టికీ త‌న‌కు ఆ డ‌బ్బు అంద‌లేద‌ని ఆ వ్య‌క్తి మ‌ల్ల‌న్న‌కు ఫిర్యాదు చేశాడు. మ‌ల్ల‌న్న త‌ర‌ఫున ఉమేశ్ చంద్ర అనే వ్య‌క్తి ప్ర‌చారం చేస్తున్నాడు.

ఇక చివ‌రిగా న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక వార్త‌ల‌న మ‌ల్ల‌న్న ప‌రిశీలించారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ దూకుడు పెంచింది అన్న బ్యానర్ ఐట‌మ్‌ను మ‌ల్ల‌న్న చ‌దివారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌మ‌ను మోసం చేసింద‌ని.. అయితే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 1 ల‌క్ష‌కు పైగా ఉద్యోగాలు ఇచ్చింద‌ని మ‌ల్ల‌న్న చ‌దివి వినిపించారు. ప‌ల్లా రాజేశ్వ‌ర్ రావు మీటింగ్ గురించి వివిధ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌ల్ల‌న్న స్పందించారు. వెన‌క ఖాళీ కుర్చీలు ఉంటే ఈ నేత‌లు ఇలాంటి స‌భను ఎన్న‌డూ చూడ‌లేద‌న‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. మ‌రో ప‌త్రిక‌లో ఉన్న ఖాళీ కుర్చీల ఫొటోను మ‌ల్ల‌న్న మ‌రోసారి చూపించారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ద్వారా ఏం కోరుకుంటున్నార‌ని అక్క‌డి యువ‌త‌ను మ‌ల్ల‌న్న ప్ర‌శ్నించారు. ఎంత చ‌దివినా ఉద్యోగాలు రాక‌పోవ‌డం చాలా బాధాక‌రం అని ఓ యువ‌కుడు అన్నాడు. విద్యార్థుల భ‌విష్య‌త్‌తో ఆడు కోవ‌ద్ద‌ని ఆ యువ‌కుడు కోరాడు.

ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్ల‌న్న మార్నింగ్ న్యూస్‌లోని మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.