
కోలీవుడ్ యంగ్ హీరో శ్రీకాంత్ (శ్రీరామ్), రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారులుగా జె.పార్థీబన్ దర్శకత్వంలో జాగ్వార్ స్టూడియోస్ నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’.
భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఓ పులి ఎక్కువ సేపు తెరపై కనిపించడం అనేది ఈ ‘గర్జన’ సినిమాలోనే కావడం విశేషం.
ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభించింది. దేవ్ గిల్, నైరా, వషన్ని, ఆరోహి తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
త్వరలో ‘గర్జన’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంగీతం అరుల్‌దేవ్ అందిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
1 నిమిషం 47 సెకన్ల వ్యవధిలో కట్ చేయబడిన ఈ ట్రైలర్ లో ముందుగా పులి ఓ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాని నుండి తప్పించుకోవడానికిహీరోయిన్, ఆమె స్నేహితురాలు, చిన్న పాప ఎటువంటి ఇబ్బందులు పడ్డారు?
అటవీ అధికారి ఆ పులిని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? మరోవైపు వరుస మరణాలు ? సీరియల్ కిల్లర్ ఎవరు ? అం ఆసక్తికర అంశాలతో ట్రైలర్ నిండి ఉంది. ట్రైలర్ లో విజువల్స్, ఆర్ఆర్ చక్కగా కుదిరాయి.
మీరు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్న థ్రిల్లర్ “గర్జన” ట్రైలర్ ను వీక్షించండి.