
ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ “రాబర్ట్” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఆశా భట్ హీరోయిన్ గా నటించింది.
తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ పై ఉమాపతి శ్రీనివాస గౌడ “రాబర్ట్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ‘రాబర్ట్’ సినిమా నుంచి “బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ” అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దర్శన్ పాటలో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.
ఇక హీరోయిన్ ఆశా భట్ తన హావభావాలతో అదరగొట్టింది. ఇక హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కాస్ట్యూమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అట్ట్రాక్ట్ చేస్తున్నాయి.
యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్న “బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ” వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో దర్శన్ నటించిన “రాబర్ట్” మూవీ తొలిసారి తెలుగులో విడుదలవుతోంది. మార్చి 11న “రాబర్ట్” కన్నడ, తెలుగు భాషల్లో భారీగా విడుదల కానుంది..
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శన్ క్రేజ్ చూస్తే సినిమా హిట్ కావడం ఖాయం అన్పిస్తోంది.