
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “పుష్పక విమానం”.
డార్క్ కామెడీ ఎంటర్టైనర్ “పుష్పక విమానం”లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా…
శాన్వీ మేఘన, గీతా సైనీ హీరోయిన్లుగా, దామెదర దర్శకుడిగా పరిచంయ అవుతున్నారు.
కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తున్నారు.
సునీల్, సీనియర్ నరేష్, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతమందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
విజయ్ దేవరకొండ తన తమ్ముడి సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి, మూవీ టీంకి విషెస్ తెలిపాడు.
Presenting the first look of #PushpakaVimanam!
Younger boy continues to find talent and pick interesting stuff.. very happy to be associated with this film as Presenter!
A dark comedy, some thrills and lots of laughs coming your way! 😄🤗 pic.twitter.com/PKG72sTCrm
— Vijay Deverakonda (@TheDeverakonda) March 1, 2021
అయితే గతంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘పుష్పక విమానం’ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే
ఇప్పుడు ఇదే టైటిల్‌తో ఆనంద్ దేవరకొండ చిత్రం రూపొందుతోంది.
కాగా ‘దొరసాని’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన ఆనంద్, ఇటీవల ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్నాడు.