పూజాహెగ్డే ఇంట విషాదం… ఎమోషనల్ పోస్ట్

241
Pooja Hegde Grandmother Passed Away

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం నెలకొంది. పూజా హెగ్డే బామ్మ మరణించింది.

ఈ విషయాన్ని తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది పూజా.

”ఈ క్యూటీని మేం కోల్పోయా. కష్టాల్లో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది.

ధైర్యంగా ఉండ‌డం, కావ‌ల‌సిన వారి కోసం ఈగోల‌ను ప‌క్క‌న పెట్ట‌డం అన్నీ అలవాటు చేసింది.

నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ల‌వ్ యూ ఆజీ. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది పూజా.

కాగా పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోంది.

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ మూవీలో నటిస్తోంది పూజా.

ఇంకా పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే.