18 ఏళ్ల వయసులో తొలిముద్దు… సీక్రెట్స్ బయటపెట్టేసిన స్టార్ హీరోయిన్

349
Parineeti Chopra reveals her first kiss

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది.

పరిణితి చోప్రా నటించిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ మూవీ రిభూ దాస్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందింది.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ పతాకంపై చిత్రీకరించిన ఈ మూవీని ఇటీవలే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై రిలీజ్ చేశారు.

‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సీక్రెట్స్ బయటపెట్టింది పరిణితి. ‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె.. తన తొలిముద్దు, లవ్ గురించి ఓపెన్ గా చెప్పేసింది.

చిన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను ఎంతగానో ప్రేమించానని చెప్పింది. ఇక 18 ఏళ్ల వయసులో ఒకరిని ముద్దు పెట్టుకున్నాను అని, అదే తన తొలిముద్దు అని వెల్లడించింది.

తాను ఎప్పుడూ ఎవ్వరితో డేట్‌కి వెళ్లలేదట.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

పరిణితి హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ పుస్తకం స్పెషల్‌ గిఫ్ట్‌గా వచ్చిందట ఈ బ్యూటీకి.

అందులో అన్నీ లేఖలే ఉండడంతో ఆ పుస్తకం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది.

కాగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పరిణితి చోప్రా ప్రస్తుతం భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైనా’ సినిమాలో నటిస్తోంది.

ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బ్యాట్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంది పరిణితి.