తల్లి కాబోతున్న “మిర్చి” హీరోయిన్

172
Richa Gangopadhyay Reveals Her Pregnancy Secret

“మిర్చి” హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించడం విశేషం.

తల్లి కాబోతోన్నా అంటూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. “ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం కానీ.. జూన్‌లో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నాము” అంటూ ఓపెన్ అయింది.

దీంతో నెట్టింట ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇక ‘లీడర్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మిరపకాయ్, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

సినిమాల్లో నటిస్తుండగానే తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ..

పెళ్లి గురించి ముందుగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ మెయిన్‌టైన్ చేసింది.

ఆ తర్వాత సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఇదీ రీతిలో తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా బయటపెట్టింది.

ఇక 2013లో వచ్చిన ‘భాయ్’ రిచా గంగోపాధ్యాయ నటించిన చివరి సినిమా. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి తన స్వస్థలమైన అమెరికాలో స్థిరపడింది.