‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆగస్ట్ 13న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.
కాగా వచ్చే నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు రాబోతోంది. ఈ నేపథ్యంలో సుకుమార్ భారీ గానే ప్లాన్ చేశారట. బన్నీ అభిమానుల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారట.
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే కాబట్టి తన సర్‌ప్రైజ్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ స్టార్ట్ చేశారట సుక్కు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తాను రూపొందిస్తున్న ‘పుష్ప’ మూవీ నుంచి ఆ రోజున ‘పుష్ప’ టీజర్ తో విజువల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
ఇక ”ఆర్య, ఆర్య 2” లాంటి సూపర్ హిట్స్ అందుకున్న బన్నీ- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.