
నాచురల్ స్టార్ నాని తాజాగా అల్లరి నరేష్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
అల్లరి నరేష్ హీరోగా కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ‘నాంది’ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలై సూపర్ హిట్ సాధించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ‘నాంది’ చూసిన హీరో నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.
”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది.
నీలో ఓ గొప్ప నటుడిని చూశాను. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు నాని.
Finally got to watch #Naandhi
రేయ్ రేయ్ రేయ్..@Allarinaresh పేరు మార్చేయ్ ఇంక
అల్లరి గతం
భవిష్యత్తుకి ఇది నాందిSuper happy for you ra .. hope to see you exploring the artist in you more and more here after 🤗
— Nani (@NameisNani) February 28, 2021
ఇంకేముంది క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది.
నాని అలాంటి చనువుతోనే అల్లరి నరేష్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ఇది వరకు అల్లరి నరేష్ కామెడీతో పాటు కొన్ని విలక్షణ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 8 సంవత్సరాల తరువాత అల్లరి నరేష్ కు “నాంది” రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ పలకరించింది.
ఈ సినిమా లాభాల బాటలో కొనసాగుతోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కనబర్చిన నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.