
కేంద్ర ప్రభుత్వం తమిళనాడు సంస్కృతిని గౌరవించదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
కన్యాకుమారిలో రోడ్‌షోలో ఆయన ప్రసనగిస్తూ కేంద్ర ప్రతినిధిలా ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి వ్యవహరిస్తారని దుయ్యబట్టారు.
ఆయన రాష్ట్రానికి ప్రాతనిధ్యం వహించరని, మోదీకి ప్రతినిధిగా ఉంటూ ఆయన ఏం చెబితే అది చేస్తారని విమర్శించారు.
మోదీ ముందు తలవంచే వారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరని రాహుల్ వ్యాఖ్యానించారు.
తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదన్నారు.
ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోదీ అంటారు. మరి తమిళం భారతీయ భాష కాదా? అని ప్రశ్నించారు.
అనంతరం తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రెండు నెలల్లో తమిళనాడులో ప్రభుత్వం మారనుందని జోస్యం చెప్పారు. ప్రజలు కూడా చాలా ఆత్రుతగా దీని కోసమే ఎదురు చూస్తున్నారన్నారు.