తమిళ చిత్రం మెర్స‌ల్ కు అరుదైన అవార్డు

503
mersal got an award in UK

గ‌త ఏడాది ఇలయదళపతి విజయ్ నటించిన చిత్రం మేర్సల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులోను ఈ చిత్రాన్ని విడుదలై మంచి విజ‌యం అందుకుంది.

జీఎస్టీకి సంబంధించి అభ్యంత‌ర డైలాగ్స్‌ తో పాటు వైద్యులకి సంబంధించి కొన్ని వివాదాస్పద డైలాగులతో ఈ మూవీ చుట్టూ అప్ప‌ట్లో ప‌లు వివాదాలు చుట్టు ముట్టాయి. అయితే వివాదాస్పద డైలాగ్స్ తొలగించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారేమోనని అందరు భావించినప్పటికి, ఏ ఒక్క క‌ట్ లేకుండా సెన్సార్ స‌భ్యులు ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా ఇందులో సత్య రాజ్ , ఎస్ జె సూర్య సపోర్టింగ్ రోల్స్ పోషించారు. సమంత, కాజల్, నిత్యామీనన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు.

అయితే మెర్స‌ల్ చిత్రం అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే అవార్డు అందించింది. దీంతో టీం స‌భ్యులు అంద‌రు సంతోషంలో ఉన్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ ..మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.