ఉత్కంఠభరితంగా “మడ్డీ” టీజర్

285
𝗜𝗡𝗗𝗜𝗔'𝘀 𝗙𝗜𝗥𝗦𝗧 𝗠𝗨𝗗 𝗥𝗔𝗖𝗘 𝗙𝗜𝗟𝗠 Muddy Teaser Released by Anil Ravipudi

ఇండియన్ ఫస్ట్ మడ్ రేసింగ్ మూవీ తెరకెక్కుతున్న చిత్రం “మడ్డీ”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ… మొత్తం 5 భాషల్లో రూపొందుతోంది.

యువన్, రిధాన్ కృష్ణ రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

పికే7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజాగా “మడ్డీ” టీజర్ ను 5 భాషల్లో విడుదల చేశారు. తెలుగు టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అడ్వెంచరస్ ప్యాన్ ఇండియా మూవీ మడ్డీ టీజర్ ను ఇతర భాషల్లో అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు.

ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “మడ్డీ” టీజర్ ఆసక్తికరంగా ఉంది.

బురదలో సాగే రేసింగ్ తో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్ ను ఇవ్వడం ఖాయం.

రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కె జీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి.

5 సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని తీసిన ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది.

ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేయడం విశేషం. ఇక టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

సమ్మర్ లో చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మీరు కూడా “మడ్డీ” టీజర్ ను వీక్షించండి.